పుట:AndhraRachaitaluVol1.djvu/567

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమ్మ తల్లులవంటి యావు లింటింటిలో

గదుపులై యమృతంబు పిదుక జేసి

కండబింకము సూపి కొండలైనను మోసి

కలుము లంది చ్చుగిత్తలను బెంచి

పనిముద్దుగాని సంపద ముద్దుగాదన్న

జీవసూత్రము శిరసావహించి

గొడగరి వడ్రంగి గోసంగి కనుదోయి

దైన్య రేఖలకు దౌదవ్వొసర్చి

కదురుగలచోటు కవ్వంబు కదలుచోటు

కఱవులకు ధూమ కేతువుగా నెఱింగి

త్యాగమున కాశ్రయము కర్మయోగి నగుచు

గీర్తిగనవయ్య భారతక్షేత్రజీవి!

       *

బెబ్బులివంటి మా తెలుగుబిడ్డమగంటిమి మొన్నసైతమున్

బొబ్బిలికోటలో నుబికి పొంగి పరాసుల ముంచిముంచి త

బ్బిబ్బొనరించి శాత్రవుల బిట్టుపొగడ్తల గాంచదా? జగం

బబ్బురమంద నాచికొనదా? శరదిందువికాసకీర్తులన్.

           *

కమ్మనిమాటలాడి నయగారము నూపినమాత్ర జచ్చు పె

ద్దమ్మల నాయకత్వ మిసుమంత సహింపడు తెల్గుబిడ్డ; శౌ

ర్యము నమంచితాశయపరంపర బిట్టు వెలార్చు నేతకై

క్రుమ్మరుచున్నవా; డతనికోరిక లెన్నటికిన్ ఫలించునో?

ఈ తీరయిన జాతీయావేశముగల కవులు తక్కువ.----లో పన్నుల నిరాకరణోద్యమమున మన చౌదరిగారు జరిమానా శిక్ష కందెను. అదిగాక, గుంటూరుజిల్లాకాంగ్రెసు సంఘములో వీరు