పుట:AndhraRachaitaluVol1.djvu/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇటు లుదాహరించుకొనుచుబోవుచో, సౌందరనందము సమగ్రముగా నిచట బ్రతివ్రాయవలసినవాడ నగుదును. తొంటి కవిత్వమున కనుకరణముగా గనిపించు పద్యములిందు తక్కువ. వానిలో గూడ ననుసరణచ్ఛాయలు తో పనీయని స్వతంత్రతయే యెక్కువ. కథావస్తువు, గ్రథననైపుణి శుచిత్వ రుచిత్వ సంవలితములగుటవలన సౌందరనంద ముత్తమకావ్యమయినది. మఱి, యేతత్కావ్యకర్తల గురుకులవాస శ్లేశము లెంతటివి !

పింగళిలక్ష్మీకాంతముగా రాముష్యాయణులు. వీరి తండ్రి చల్లపల్లి జమీకి జెందిన 'ఆముదార్లంక' లో మనుగడ సాగించుచు, నాయూర బెత్తనము వహించిన వ్యవహర్త. అన్నదానములో నాయన పలుకుబడి గొప్పది. ఆయన యన్నదాన వ్రతమును ఫలింప జేసిన కుటుంబిని కుటుంబమ్మగారు. లక్ష్మీకాంతకవి యా దొడ్డతల్లి కడుపు. ఆమె మోచర్ల వారి యాడుబడుచు. మోచర్ల - పింగళి వంగడముల వారికీ వియ్యము నాలుగైదు తరములనుండి వచ్చుచున్నది. లక్ష్మీకాంత కవిగారి భార్య లక్ష్మీనరసమ్మగారు కొంత సాహిత్యము తెలిసిన యామె. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు కంటిజబ్బు చికిత్సకై 1933 లో విశాఖపట్టణమున గొంత కాల ముండెను. మకాము లక్ష్మీకాంతముగారి యింట. అపుడు వారికి లక్ష్మీకాంతముగారి యిల్లాలు చేసిన యుపచార గౌరవము గొప్పదనియు, శాస్త్రులుగారు ఆమెకు సంస్కృతకావ్యములు పాఠములు చెప్పి శిష్యురాలిని జేసికొనిరనియు 'జాతకచర్య' ఇటీవలి భాగమున గనబడినది.

లక్ష్మీకాంతముగారి యాంగలపు జదువు స్కూలుఫైనలు దాక బందరు హిందీస్కూలులో. ఎఫ్.ఏ;బి.ఏ లు బందరునందే యున్న నోబిలు కళాశాలలో. మూడవ 'ఫారము' చదువుచుండగా 1909 లో లక్ష్మీకాంత మున్న హైస్కూలులో తిరుపతి వేంకటకవులు శతావ