పుట:AndhraRachaitaluVol1.djvu/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నూతనకవులు చేతగాని వ్రాతలు వ్రాసి, వానిపై భావకవిత్వ ముద్రవేసి బ్రతుకు తెరువు చూచుకొనుచుండుటవలన నీ కొంపమునక యైనది.

రాయప్రోలువారు పరిపక్వమతులు; పాశ్చాత్య సాహిత్యవిశారదులు; నవ్యకవితో పాసకులు. పడమటి కవులలోని ప్రకృత్యారాధన పరత్వము వీరిలో బుంజీభవించినది. వీరిభావన గభీరమధురమైనది. స్వరకల్పనము అభినవమైనది. వీరికవితకు ద్రాక్షా - కదళీపాకములు సహజములు.

మామిడి కొమ్మ పైన గల మంత్రపరాయణు డైన కోకిల

స్వామికి మ్రొక్కి నేనభినవస్వర కల్పన కుద్యమించితిన్

గోమల గోస్తనీ రుచులకుం గదళీఫలపాక సిద్ధికిన్

లేమల దేరు మా తెలుగు లేతముదళ్లు వెలార్చు వేడుకన్.

రమ్యాలోకము

1912 సం.న నవ్యకవిత్వ నేపథ్యమునుండి క్రొత్త నడలతో గొత్తవిలాసములతో గ్రొత్త హావభావములతో 'లలిత' కావ్యము రంగమునకు వచ్చినది. తోడనే రసజ్ఞభావకుల చక్షూరాజీవములు దానిపై బడినవి. 'లలిత' తో యువకవు లువ్విళూరిరి. ప్రాచీనసాహిత్య పరాయణులు 'లలిత' స్వేచ్ఛాప్రవృత్తికి లోలోపల బాధపడిరి. ఆంగ్లేయవాసన పట్టి క్రమముగా దెలుగువారు నవ్యకావ్య పఠనమున కలవాటు పడినారు. 'తృణకంకణము' వెలువడినది. శాబ్దికముగా గొన్ని దొసగులు దొరలినను సుబ్బారావుగారిది మంచి నిబ్బరమైన కవితా ధోరణి యగుటచే యువకుల గుండెలకు బట్టుకొన్నది. కష్టకమల - స్నేహలతాదేవి - స్వప్నకుమారము - తెలుగుతోట - ఆంధ్రావళి - రమ్యాలోకము మున్నగా నెన్నోకృతులు వీరివిగా వ్యాపించినవి.

రాయప్రోలు కవి 'శాంతినికేతనము'న గొంతకాలముండి రవీంద్ర సాహచర్య మనుభవించెను. ఆ సాహచర్యము వీరికవితా శక్తికి వికాసము. పెక్కుభాషల నెఱిగి ప్రకృతిరహస్యముల నాకళించి రవికవి