పుట:AndhraRachaitaluVol1.djvu/483

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవితాచ్ఛాయలు తెనుగునకు దింపుచు రాయప్రోలుకవి పలువురపొగడ్తలకు బాత్రు డయ్యెను. కట్టమంచి రామలింగారెడ్డి యీయనను స్తుతించినాడు.

మఱియొకటి: శ్రీ సుబ్బారావుగారితో జాతీయాభిమానము సహజమైనది. ఈయన అచ్చముగా దెనుగువాడుగా వర్తించును. ఆంధ్రోద్యమము వీరి కవితకు రంగస్థానమైనది. 1918 నాటికి "రాయప్రోలు" జాతీయ కవితావాహిని పొంగినది. ప్రాంచీనాంధ్ర సామ్రాజ్యమహోన్నతి, ప్రాచీనసాహిత్యకళోన్నతి కన్నుల కెదురుగా గట్టి యీ కవి మురిసిపోవును. "జారిన దేశగౌరవము చక్కగ దిద్ది మహాంధ్రమండలీ, భారము శ్లాఘనీయముగ బాలన చేసి సమానరాష్ట్రముల్, కూరిమినాస జేయ దెలుగుంబుడమిన్." సముద్ధరింపుడని తెలుగువారికి మేలుకొలుపు పాడిన రాయప్రోలు 'జాతీయకవు' లలో మొదటివాడు. ఈయన 'ప్రబోధము' సూర్యకిరణ్ము వంటిది.

అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వ

విద్యాలయములు స్థాపించునాడు

ఓరు గల్లున రాజవీర లాంఛనముగా

బలు శస్త్రశాలలు నిలుపునాడు.

విద్యానగరరాజ వీథుల గవితకు

బెండ్లి పందిళ్లు కప్పించునాడు

పొట్నూరికి సమీపమున నాంధ్రసామ్రాజ్య

దిగ్జయస్తంభ మెత్తించునాడు,

ఆంధ్రసంతతి కే మహితాభిమాన

దివ్య దీక్షానుఖ స్ఫూర్తి తీవరించె

నా మహావేశ మర్థించి యాంధ్రులార

చల్లు డాంధ్రలోకమున నక్షతలు నేడు.

                *