పుట:AndhraRachaitaluVol1.djvu/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రౌడార్థప్రదీపితములు, భావభూషితములు నగు నీ జయపురాధీశ్వరుని పద్యరచనలు పరికించినచో "కృష్ణదేవరాయలు విష్ణుచిత్తీయకృతికర్తకా"డను దుర్వాదము సడలిపోవును. ఆ కవిరాజు వ్రాసికొన్న 'కవిజన్మకుండలి' యిం దుదహరించుట యెందు కేని మంచిది.


గీ. అజము లగ్న మచ్చోటనే యమరగురుడు

యుగ్మమున రవి బుధ శుక్ర లొప్పుచుండ

గర్కి రాహువు కుజుడు సింగంబునందు

వృశ్చికంబున శని కర్మ గృహమునందు

జంద్ర కేతువు లుండంగ జంద్రనంద

శైల శశి శాలివాహన శకనమ దగు

మిధున మానేషు శశిదిన మిళిత శుక్ల

పక్ష శుక్ర మాసా పరపక్షమందు

జవితి నినవారమున ధనిష్ఠా ద్వితీయ

పాదమున విక్రమేశ్వవర్మ వొడమె

గుజదశా శేషమగు నాలుగు సమ లైదు

నెలలు నిరువది యేడు నాళులు గణింప.

[శాలివాహనశకము 1791 శుక్ల సం. జ్యేష్ఠ బ 4 ఆదిత్య]

                             ___________