పుట:AndhraRachaitaluVol1.djvu/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రిప్రెగడ భుజంగరావు

1876 - 1940


ఆరువేల నియోగి శాఖీయ బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు, హరితస గోత్రుడు. లక్కవరము జమీందారు. దత్తత గొన్న తల్లిదండ్రులు: విజయలక్ష్మమ్మ, మల్లికార్జున ప్రసాదరావు. కన్నతల్లి: వెంకమాంబ. కన్నతండ్రి: మల్లయామాత్యుడు. జన్మస్థానము: ఏలురు. జననము: 1876, ధాతృసంవత్సర చైత్ర బహుళ పంచమీ గురువారము. నిర్యాణము: 1940 సం|| గ్రంథములు: దిలీపచరిత్రము, స్తవరాజము, హరిశ్చంద్ర నాటకము, మైరావణుడు, మోహలేఖావళి, మాల్కిసువార్త, మార్కండేయేశ్వర చరిత్రము, పాండవాజ్ఞాతవాసము, పరమ పురుషాన్వేషనము, పదార్థ విజ్ఞాన శాస్త్రము, నిరపవాద ప్రహసనము, చిత్ర హరిశ్చంద్ర నాటకము, చారుమతీ పరిణయము, ఉత్తరరామ చరితము, ఆధునిక కవిజీవితములు, కలియుగ నటనామృతము, విజయాంక సాహసము, అభిజ్ఞాన శాకుంతలము, వచననైషధము, వాసంతిక, వ్యవసాయ, మార్కండేయ శతకము, రాజహంస, మధుప విహారము, తత్త్వమీమాంస, ఆంధ్ర కథా సరిత్సాగరము, గోఖలే చరిత్ర, లూకా సువార్త, దీనరక్షామణి శతకము, అగ్గిరాముని మరణావేదనము- ఇత్యాది నాటకములు, నవలలు, విమర్శన గ్రంథములు, వివిధ విషయక గ్రంథములు వీరిని శతాధికముగా నచ్చుపడినవి.


శ్రీ భుజంగరావుగారిని జమీందారులు గాను, కవులుగాను మన మెఱుగుదుము. వారు సామాన్య రచయితలుగాక శతాధిక గ్రంథ రచయితలు, దర్శనాచార్యులు, వితరణ చతురులు కూడను. వీరికి సంస్కృతాంధ్రములలో దగిన సాహిత్యమున్న దని కృతులు ప్రకటించుచున్నవి. ఆంగ్లమునందును బ్రజ్ఞ గొప్పది. గ్రంథరచన మందేకాక 'మంజువాణి' పత్త్రికా ప్రచరణముచే దమ ప్రతిభ వితతముగా వెలువరించుకొనిరి. అంతతో దృప్తిపడక విలాసార్థ మవధానములు జేసినారు. వీరు చేసిన యష్టావధానమునకు సభాపతులైన కొక్కొండ