పుట:AndhraRachaitaluVol1.djvu/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామకృష్ణకవులు సారస్వతములో గ్రొత్త క్రొత్తత్రోవలు తీయునుద్దేశము గలవారు. కవిత్వములో సంస్కృతిని వీరు వలచియున్నారు. 'ఆంధ్రపత్రిక' కాలయుక్తి సంవత్సరాది సంచికలో వీరు "ఆంధ్రకవుల అపరాధములు" అను శీర్షికతో గొన్ని పద్యములు ప్రకటించిరి. పరిహాస గర్భముగా బ్రాచీనకవుల యపరాధము లందు వర్ణింపబడినవి. పద్యములు మొత్తము ముప్పదియేకాని తెలుగుదేశమున గొప్ప యలజడి రేపినవి. కొన్ని యుదాహరించుట యవసరము. రచనా చమత్ర్కియకు మనము మెచ్చుకోవలయునుగదా!

గీ. ఆంధ్ర లోకోపకారమ్ము నాచరింప

భారతమ్మును నన్నయభట్టు తెలుగు

జేయుచున్నాడు సరియె; బడాయిగాక

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుడి!

గీ. పామరుడువోలె దిక్కనసోమయాజి

వెఱచి తాంధ్రీకరింప విడిచినట్టి

భారతమ్మున వ్రేల్వెట్ట బట్టిగాని

యెఱ్ఱప్రెగ్గడ బండార మెవ రెఱుగరు?

గీ. అచ్చ తెనుగు పదంబుల నిచ్చకొలది

బుచ్చి తలతిక్క యంవయంబులను బెట్టి

పాడుచేసెను నన్నయభట్టుదారి

యుభయకవి మిత్రులష! తిక్కయొజ్జగారు.

గీ. రావు సర్వజ్ఞసింహ భూరమణుతోడ

బావ శ్రీనాథ కవిసార్వభౌము డేమొ

చెప్పి తత్కరుణాపాత్రు జేయుపిదప

భోగినీదండకము నాడె బోతరాజు.