పుట:AndhraRachaitaluVol1.djvu/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీచుడైనను వాని నింద్రుడుగా, చంద్రుడుగా స్తోత్రములు చేయుటయు, తిరస్కారభావము కనబఱచిన రసిక ప్రభువునైన దృణప్రాయముగా దీసివైచుటయు వీరికి సహజము. ఇందులకు వందలు నిదర్శనములు.

వేంకటరామకృష్ణ కవులతో, కొప్పరపు గవులతో వీరు గావించిన వివాదములు భాషాచరిత్రములో శాశ్వతముగా నుండగలతీరున నున్నవి. గీరతము, గుంటూరిసీమ చూచునది. ఆ ప్రతిజ్ఞలు బహు భయంకరములుగ నుండును.

శా. ఱతుల్ మానడు తిర్పతిద్విజుడు నీరంధ్రా వివేకాన్విత

స్వాంత భ్రాంత నిరంతరానృత వచ: ప్రకాంత దుష్కల్పనా

ధ్వాంత క్రాంత కుకావ్య నవ్యరవి దీప్య ద్భవ్య తేజోంచితా

హంతా దంతుర పాక్ర్పణాళికల నీహమ్మార్ప కేనాటికిన్.

శా. ఱతుల్ మానడు తిర్పతి ద్విజుడు పర్యాయాదృ తానేక సా

ధ్వంతేవాసి కృతావధాన సమయ వ్యాఖాన విఖ్యాపితా

శాంతస్థాయి యశ: ప్రసూన కవితా సొందర్య రాజద్గళో

పాతున్ దేశికుగూర్చి వ్రాసిన యసత్యాల్ మాంప కేనాటికిన్

శా. 'రావుల్ వీడు' మటంచు మిణ్కెదవు ధీరమ్మన్యుని న్నిన్ను దు

ర్వ్యాపారున్ సభలోని కీడ్చి భవదార్థబావవాదానృతా

లాపంబు ల్మొదలంట గాల్చి పయి వాలాయంబు శిక్షించి నీ

పాపం బూడ్చి నతుల్ గ్రహించునట! తత్ర్పాగల్భ్య మూహించి తే!

శా. 'రాపుల్ వీడడు వేంకటాచల' మసారస్సార ఘోరానృతా

లాసాం తేవస దాన్య కర్కట విశాల శ్వభ్ర దుర్ద్వార్బహి:

ప్రాప-రతరా విలాంబు పృష దావత్ర్పాపకాత్మీయ వా

గ్రూపాసార పరంపరా విభవముల్ గుప్పింప కేనాటికిన్.

శా. 'డంబాల్ మాను' మటంచు మిణ్కెదవు ప్రౌడమ్మన్యతాదోషమూ

డంబై నట్టి భవన్మనంబునకు వ్రీడం బుట్టగాజేయ ని