పుట:AndhraRachaitaluVol1.djvu/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయములు, రాజసూయాశ్వమేధములు దీనిలోనివే. గీరతముకూడ నీ భారతములోనిదే. ఈ భారసంగరమునకు 'గుంటూరుసీమ' కురుక్షేత్రము. వాగ్యుద్ధములవలన దిరుపతికవుల యశశ్చంద్రికలు నలుమూలల వెల్లివిరిసినవి. ఇంత నిర్లక్ష్యముగా మహారాజులను, మహాపండితులను ధిక్కరించిన తెలుగు కవులు శ్రీనాథాదు లేకొందఱో మనకు వినబడుచున్నారు.

సంగరశక్తి లేదు, వ్యవసాయముసేయుట సున్న, సంతలో

సంగడివేసి యమ్ముటది యంతకుమున్నె హుళక్కి మష్టికిన్

బొంగు బుజానవైచికొని పోయెద మెక్కడికేని ముష్టి చెం

బుం గొనిపెట్టు మొక్కటి యమోఘ మిదేకద, దంతిరాణ్నృపా!

మహారాజునుగూర్చి చేసిన యీ మందలింపులో నెంతయర్య్హము దాగియున్నదో పరికింపుడు.

మ. అటు గద్వా లిటు చెన్నపట్టణము మధ్యం గల్గు దేశమ్మునన్

జటులస్ఫూర్తి శతావధానములు మెచ్చం జేసియున్నట్టి మా

కిట రా జీయక యున్న దర్శనము నింకెవ్వాని కీ రా జొసం

గుట ? చెప్పంగదవయ్య పాలితబుధా, కోదండరామాభిదా!

శ్లో. రాజా విద్వాన్ భవాన్ విద్వా సహో భాగ్యం మహాకవే,

అత్రాపి దర్శనం నోచే త్కవితాయై నమోనమ:.

విజయనగర ప్రభుని దర్శించుటకు వెళ్ళినపుడు, వారు సభ చేయింపక సన్మానింపగా నపుడు దివాను కోదండరావుగారిని గూర్చి తిరుపతి కవులు వ్రాసిన పద్యము లివి. రాజసందర్శనము ధనాపేక్షతో గాక పాండితీ ప్రదర్శనమునకే జేసికొన్నట్లు పలు పద్యములు విశదము చేయుచున్నవి. ఈ జంటకవులలోని యొకలక్షణము నానారాజసందర్శనమువల్ల నిట్లు తెల్లమగుచున్నది. అవసరమగునపుడు, దాత యెట్టి