పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలిగిపోవుచుండ, నాసింహాసన స్వర్ణ సోపానపంక్తి నెక్కుచు, కనకదండయుక్తుడై, కాలకంపన మహారాజు కుడివైపున నిలువ, జయనంది బుద్ధవర్మలు వింజామరలు వీవ, పృధ్వీశవర్మ దవళచ్చత్రము ధరింప, నుత్తమ త్రయీపాఠులు, గంగాయమునా పవిత్ర జలములు నిండిన సకల రత్నఖచితస్వర్ణ కలశములు ధరించి, యీవలావలనిలువ ఉత్తమ చాళుక్య కుబ్జవిష్ణువర్ధన మహారాజు పరమభట్టారకుడై ఆంధ్రచాళుక్య సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెను.


సమాప్తం

అడివి బాపిరాజు రచనలు - 6

284

అంశుమతి (చారిత్రాత్మక నవల)