పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఏమియు భయము లేదు. పరుండు మమ్మ! నేను వైద్యుడను. వీరుగో మహాప్రభువులు. అదే వారు కాలకంపన ప్రభువులు. తేనెతో రంగరించిన ఈ మందు సేవించి స్వాస్థ్యమునంది యా వెనుక మహారాజుతో నీవు చెప్పుకొనునది మనవి చేసికొమ్ము” అని యావైద్యుడు చల్లని మాట లాడుచు ధైర్యము చెప్పెను.

“మూడు దినములనుండి తిండి లేకుండటచే దల తిరిగి, మూర్చ వచ్చినది మహాప్రభూ! అందుకు క్షంతవ్యను. రాజకుమారి! మా రాజకుమారి! మహాప్రభూ!...” ఆమె కంఠము రుద్దమై మాటలాడలేకపోయివది. ఆమే కన్నుల జలజల నీరు ప్రవహించినది. విష్ణువర్ధను డా బాలికవైపు చూచుచు, “మీ రాజకుమారిక?” అని సాంత్వనముగ ఆమె కంఠము!

“మహాప్రభూ! మా మహారాజకుమారి యీ యంతఃపుర మందిరములలో నభ్యంతర కారాగారమునందు మూడు దినములనుండి పస్తుపడియున్నది. ఆ పిశాచులు మమ్ముపెట్టిన బాధలు-” ఆమె కన్నులనుండి మఱల బాష్పప్రవాహములు పొరలివచ్చినవి.

విష్ణువర్ధనుడు గంభీరస్వరమున “కాలకంపన ప్రభూ! మీరు వెంటనేపోయి ఈ దుష్ట సంఘటన మేమో కనుగొని రండు ఆరాజకుమారికకు సకలోపచారములు చేయింపుడు...రాజవైద్యునివైపు తిరిగి “వినయ దీక్షితులవారూ! మీరును కంపన ప్రభువు ననుసరించుడు. ఆ రాజకుమారికకు మీ వైద్య మవసరముండునేమో యని నాకు దోచుచున్నదని వహించినాడు.

“మహారాజా! నా కిప్పుడు సత్తువ వచ్చినది. ఈ పరిచారికల సహాయమున నేను మా రాజకుమారి కడకుబోయిన తరువాత తమతో నన్నియు మనవి చేసికొందు” నని యా బాలిక మంచాసనము పై నుండి లేచినది. విష్ణువర్ధనుడు దయార్ధ్రదృక్కుల నామెపై బరపుచు, “అటులనే పోయిరమ్ము” అని యామె కానతి యిచ్చినాడు. పరిచారికల సహాయ మక్కర లేకయే యా బాలిక లేచి, విష్ణువర్ధనునకు నమస్కరించి, యభ్యంతర మందిరము లోనికి వెడలిపోయినది.

విష్ణువర్ధనుడొక్కడు అచటనున్న సుఖాసనముపైనధివసించినాడు. ఎవరీ రాజకుమారీ! పరిచారికలకన్న నికృష్టముగా జూచి, యామెను బంధించిన మహాపాపి ఎవడు? ఒక్కొక్కప్పుడు మానవుడు నరపిశాచియే యగును. మనష్యుని కాంక్ష లనంతములు. మానవ ధర్మముకై, పురషార్ధ సాధనమునకై తమ జీవితములు సమర్పించు మానవులేపాటి గలరు! దురాశా పిశాచగ్రస్తుడైన మనష్యుడు హీనాతిహీనముగ సంచరించును అని యాలోచించుకొనుచు నా బాలిక స్థితి యేట్లున్నదో తెలిసికొనుటకై తొందరపడుచుండెను.

ఇంతలో రాజవైద్యుడును, కాలకంపన ప్రభువును నచ్చటకు విచ్చేసినారు.

వైద్యుడు: మహారాజా! ఆ బాలిక వేంగీపుర విష్ణుకుండిన మహారాజు నేక పుత్రిక. అంశుమత్యభిథాన. ఆమె జాతకమునందు గొన్ని గ్రహదోషముల బరిహరింప వారి రాజగురు వామెను మాఖస్నాన వ్రతశీలను జేసెనట. ఆ రాకుమారి నాలుగు దినముల పూర్వము వఱకు గోవూరు నందు విడిది తీర్చి గౌతమిలో స్నాన వ్రతమును సంపూర్ణము

అడివి బాపిరాజు రచనలు - 6

255

అంశుమతి(చారిత్రాత్మక నవల)