పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పృథివీరాజుభార్య.

49

నందునిరాతంకముగాఁదిరుగుచుండిరి. అచటికిఁబురుషు లెవ్వరును రాకుండ కట్టుదిట్టములు చేయఁబడినను అక్బరుమాత్రము స్త్రీవేషమున నచట నితరుల కెఱుఁగ రాకుండునటుల సంచరింపు చుండెను.

ఆయుత్సవమునకు నొకసంవత్సరము పృథివీరాజు భార్యవచ్చెను. కాని యా యుత్సవమువలన నామె కెంతమాత్రము సంతోషము కలుగ లేదు. ప్రచ్ఛన్న వేషముతో నుండిన బాదుషా యత్యంతరూపవతియగు నామగువనుగని మిగుల మోహితుఁడయి యామె మఱలి వెళ్లుమార్గమున నామెరాక నిరీక్షింపుచుండెను. ఇంతలో నాసాధ్వీమణి మఱలి తననగరునకుఁ జనుటకై బాదుషా కాచుకొనియుండినమార్గమునఁ బోవఁదొడఁగెను. అట్లు వచ్చుసుందరిని నకస్మాత్తుగా నాడిల్లీశ్వరుఁ డరికట్టెను. తన నరికట్టినవాఁడు అక్బరనియు, దురుద్దేశముతో నాతఁ డిట్లు చేసెననియు నాకాంత తెలిసికొనెను. అంత నామెతనవలెనే యితర స్త్రీల నెందఱినో కపటస్త్రీ వేషధారియగుబాదుషా చెఱుప యత్నించియుండునని తలఁచి క్రోధావేశపరవశురాలయి మిగుల రోషముతోఁ గన్నుల నిప్పులురాలతనగుప్తభల్లమును చేత ధరించి మిగుల ధైర్యముతో "పవిత్రమగు క్షత్రియవంశమును కలంకమయము చేయఁదలంచిన దుష్టు బారినుండి నాపాతివ్రత్యమును సంరక్షించుకొని యీద్రోహిని నాచేతిఖడ్గమునకుఁ బలియియ్యగలను" అని బలికెను. ఇట్లు గంభీరస్వరముతోఁ బలికిన ధైర్యవతి పలుకులు విని బాదుషా కొరతవడి చిత్రప్రతిమవలె చేష్టలు దక్కి నిలువఁబడి తదనంతర మాతఁడు విజ్ఞానవంతుఁడగు ప్రభువగుటచేఁ