పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పృథివీరాజు భార్య.

                   గుణో భూషయతేరూపం శీలం భూషయతే కులం. [1]

ఈమె సిసోదియావంశమునందుఁ బుట్టి సుక్తావతవంశస్థాపకుఁ డైనసుక్తరాజు పుత్రియు, రాఠొరువంశమునందుఁ బ్రసిద్ధుఁడగు పృధివీరాజు పత్నియునని పూర్వచరిత్రములు చెప్పుచున్నవి. ఈమె అక్బరుబాదుషాతో సమకాలీనురాలు; గాన పదియాఱవశతాబ్దారంభమునందుండెనని తేలుచున్నది.

అక్బరుబాదుషా యితరతురుష్క ప్రభువులవలెఁ దనప్రజలను బాధింపక వారివారిధర్మములను రక్షించుటచే సర్వధర్మ సముఁడని ప్రసిద్ధుఁ డయ్యెను. ఆయన సకలజనులకును, దనకును మనోరంజనము గలుగుటకై ప్రతిసంవత్సరము తననగరమునందుఁ గొన్నిదినములు గొప్పయుత్సవము జరుపుచుండెను. ఆయుత్సవపు తుదిదినమునందచట సర్వము స్త్రీమయముగానే చేయఁబడుచుండెను. ఆస్త్రీప్రపంచములో ఆడువారును, పాడువారును, అమ్మువారును, కొనువారును, ఇతరమైన యుత్సవములఁ జేయువారును చూచువారును అందఱు స్త్రీలే! ఆరోజు పురుషులకు నీయుత్సవము జరుగుచున్న స్థలమునకు వెళ్ళుటకు ననుజ్ఞ లేక యుండెను. కాన నాఁటిదినము బాదుషా యంత:పురము నందలి స్త్రీలును, ఇతర రాజపత్నులును ఆయుత్సవము

  1. రూపము సద్గుణముచేఁ, గులము సచ్ఛీలముచే నలంకరింపబడును.