పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హితముకొరకు రాజ్యమునందు జేసిన సంస్కరణములు, అనుభవము గలిగినట్టియు, రాజ్యకార్యదురంధరు డగునట్టియు బురుషునకు గూడ భూషణాస్పదంబులు" ఈ గ్రంథకారుని వాక్యముల వలన శికందరుబేగ మెంత రాజధర్మ నిపుణమయినది తేట పడుచున్నది. ఈమెయందు గల ముఖ్యగుణము వత్సలత; అనగా ప్రజలను వాత్సల్యముతో జూచుకొని ప్రేమించుట. ఇందు విషయమైభర్తృహరి తన నీతిశతకమునందిట్లు వ్రాసియున్నాడు.

    రాజన్ దుధుక్షసి యది క్షితిధేనుమేనాం
    తేనాద్య వత్సమివ లోకమముం పుషాణ
    యస్మింశ్చ సమ్యగనిసం పరితుష్యమాణే
    నానాఫలై: ఫలతి కల్పలతేవ భూమి:.*

ఇట్లు బేగమువారు లోకులయెడ వాత్సల్య ముంచుటవలన, వారు సకలజనులకు బూజ్యులయి, పృథ్విని కల్పవృక్షము గావించి, స్వేప్సితఫలములను గైకొనిరి! బేగముగారివలె బ్రజావాత్సల్యమే పరమధర్మమని సకలరాజులు తలంచి అటుల వర్తించుటకు యత్నించిన పక్షమున, లోకములోని జనులందరు సుఖింతురుగదా? జితజేతులలోని వైరముడుగునుగదా?

రాణిగారు తురష్కులయినను, తమరాజ్యములోని హిందూ జనులను దయతో జూచుచుండిరి. నిరపరాధులగు


  • "తే.గీ. ధరణిధేనువు బిదుకంగ దలచితేని

        జనుల బోషింపు మధిప వత్సములమాడ్కి
        జనులు పోషింప బడుచుండ జగతి కల్ప
        లతతెరంగున సకలఫలంబు లొసగు."