పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారి కెన్ని టోపీలో, వీరి కన్ని టోపీలు! "అయం నిజ: పరోవేతి గణనా లఘు చేతసాం | ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం ||" అనిన మాట యీమె యెడలనే సార్థకమైనది. ఒకసారి యొక యూరినుండి మరియొక యూరి కీమె భర్తగారికి బదిలియై పోవుచు, మార్గస్థుల కొర కేర్పడిన యొక సత్రమున విడిసిరి. ఆ సత్రమును గని పెట్టుకొని యుండు కూలి వాని గుడిసె యచ్చటకు గొంత దూరమున నుండెను. అచ్చట నెవతియో యాడుది దు:ఖపడుచున్నటుల శబ్దము విని, యచ్చమాంబగారా గుడిసెకు స్వయముగా వెళ్లి, వాండ్ల కష్టములను విచారించి యా స్త్రీకి నీళ్లాట ప్రొద్దులైనందున ఖర్చునకు గొంత సొమ్మిచ్చి వారి నోదార్చెను. అదియునుగాక యాకూలివాని జీతము హెచ్చుచేయుటకై తన పెనిమిటి ద్వారా యత్నముచేసి, వానిజీతముకొంత హెచ్చునటుల జేసెను. ఇటీవల కొంతకాలమునుండి బిలాస్ పూరులో ప్లేగు ఉన్నందున నూరుబైట గుడారములు వేసికొని కాపురము చేయుచుండిరి. డిశంబరు నెలలో వీరు కాంగ్రెస్ నిమిత్తమై బొంబాయివెళ్లుటకు సిద్ధముచేసికొని బయలుదేరబోగా, నొక సేవకునిభార్య నిండుప్రొద్దులదియైనందున నొప్పులు పడజొచ్చెను. అపుడు ప్రయాణమాపి యచ్చమాంబగారు దానికి స్వయముగా మంత్రిసానితనముచేసి పురుడు పోసెను. పిల్లకు బొడ్డుకోసి నీళ్లుపోయించి యప్పుడు ఉన్ని అంగీలు అల్లి, తొడిగించి తల్లికి గావలసిన మందులు వగైరాలు సిద్ధముచేసి, పదిరోజులకు సరిపడు సామానులు వాండ్ల కమర్చి, రెండవరోజున బయలుదేరి బొంబాయి వెళ్లిరి. బొంబాయినుండి తిరిగి వచ్చిన తరువాత నీ గుడారములోనే యచ్చమాంబ గారు కీర్తిశేషులైరి. 1898 వ, సంవత్సరము కరువులో నీమెభర్త గారు క్షామశాల (ఫ్యామిన్ క్యాంపు) పై నధికారిగా నుండిరి. అక్కడ నొకానొక తల్లిదండ్రులు నిర్దయులై రెండు నెలలు తనకుమారుని విడిచివెళ్లిరి. ఆపిల్లవానిని బెంచువారెవరును లేనందున మిషనరీల కిచ్చివేయవలయునని యధికారులు నిర్ణయింపగా, దీనావనయగు అచ్చమాంబగారా సమాచారమువిని యాపిల్లవానిని దా బెంచదననియు బరధర్మకుల కియ్యనక్కరలేదనియు నధికారులకు దెలిపి, యాపిల్లనిదెచ్చి యెంతయు వాత్సల్యముతో బెంచుచుండెను. అ కరువులోనే యిక నొక 10 యేడుల పిల్లవాడు వాని యనాధయగు తల్లియు జెల్లెలు నుత్తర దేశమునుండివచ్చి బిచ్చ మెత్తుకొనుచు జీవించు చుండిరి. దీన