పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీ లక్ష్మీబాయిగారు కల్పీకి వచ్చిన సంగతి విని బందేవాలానవాబు సహితము తన సైన్యములతో రావునాహెబు పేష్వాగారికి సహాయుడయ్యెను. వీరందరును తమ సైన్యములను యుద్ధసన్నద్ధముగా జేయుచుండిరి. రాణిగారి శౌర్యము నెరిగియు రావుసాహెబు పేష్వాగారు తనకుగల స్వాభిమానమువలన దన సర్వసేనాధిపత్యమును నొకస్త్రీ కిచ్చుటకు సమాధానపడడయ్యెను. కాన రాణిగారు కొంత వరకు యుద్ధమునందు నిరుత్సాహురాలయి యుండిరి.

సర్ హ్యూరోజ్ దొరగారు ఝాశీనుండి బయలుదేరి కాల్పీని గెలుచుటకయి సైన్యసమేతముగా రాత్రిం దినప్రయాణములు చేయుచు కాల్పీ సమీపమునందలి కూచయను గ్రామమున పేష్వాగారి సైన్యముల నెదిరించి క్షణములో నోడించిరి. కాన పేష్వా, బందేసంస్థానపు నవాబు మొదలగువారితో రాణిగారు కాల్పీకి వెళ్ళవలసివచ్చెను. ఆ సమయమునందామె సొంతసైన్యము లేనందున పేష్వాగారామెను మన్నింపనందునను ఈ యుద్ధమునందామె ప్రతాపమేమియు దెలిసినదికాదు. కాని కాల్పీకి వెళ్ళినపిదప నామె సైన్యము బందోబస్తును గురించి తన యభిప్రాయము పేష్వాగారికి దెలిపెను. అప్పుడాతడు లక్ష్మీబాయిగారి తెలివిని గని తాత్యాటోపేని లక్ష్మీబాయిని సర్వసైన్యాధిపత్యమునకు నియమించెను. అందుపై వా రిరువురు మిగుల దక్షతతో సైనికులకు యుద్ధము గరపు చుండిరి. ఇంతలో నాంగ్లేయసైన్యంబులు కాల్పీనగరము నలుప్రక్కల ముట్టడించెను. అప్పుడు రెండువందల గుర్రపుబలము