పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులు దూరదర్శక యంత్రమువలన గనిరి. అంత నగ్నిదేవునకు వాయుదేవుడు సహాయమగునటుల నీ రాణిగారికి నాసైన్యము వచ్చి తోడుపడిన మన జయ మసత్యమనుకొనిరి. సర్‌హ్యూరోజ్ దొర యంత మాత్రమున జంకక యిచట రాణిగారితో బెనగ గొంత సైన్యమును నియమించి కోటలోనివా రెరుగ కుండ గొంతసైన్యమును కాల్టీమార్గమున కంపెను. వారు చనియా త్రోవలో వచ్చుచున్న విపులసైన్యములతో బెనగి తమ యుద్ధసామర్థ్యమువలన వానిని బారదోలిరి. తాత్యాటోపే సైన్యముల బారి కోపజాలక తమ యుద్ధసాహిత్యము నచటనే విడిచి పలాయితములయ్యెను. కాన నా సాహిత్య మనాయాసముగ దొరకినందున సర్ హ్యూరోజ్ గారి బలంబులు మిగుల నుత్సాహముగలవయ్యె. వారికి నిదివరకుగల నధైర్యమంతయు నడుగంట శత్రువులపై నధికోత్సాహముతో తప్తగోలవర్షము గురిపింపసాగిరి.

ఏప్రియల్ 2 వ తేదివరకును యుద్ధము జేసియు దాము పురప్రవేశము చేయలేకుండుటకు మిగుల చింతిల్లి సర్ హ్యూరోజ్ దొరగారు తమ బుద్ధిప్రవీణత వలన నా దినమున నా కిల్లాను చేకొనదలచిరి. ఆయన తదనుసారంబుగా బలంబుల నంప వారును మిగుల నుత్సాహముతో శత్రుపక్షమునుండి వచ్చు బాణములను సైచి గ్రామద్వారముల నుండియు, గోట గోడనుండియు బురము జొరసాగిరి. తాత్యాటోపేగారి పరాభవమును విని రాణిగారి సైనికులు మిగుల నిరుత్సాహులైరి. అయినను యుద్ధమునందు దెగగా మిగిలినవారికి రాణిగారు