పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరగారు ఇంగ్లండు దొరతనమువారి యనుమతిగొని ఇంగ్లండు నందలియు, హిందూ స్థానమునందలియు ప్రవీణులగు సేనా నాయకులను రప్పించి రాజభక్తిగల యితర సైన్యములను, సహాయార్థ మరుదెంచిన యితర భూపతుల సైన్యములను వారిపరముచేసి యాప్రచండ సేనను నడుపుటకు యుద్ధకళా విశారదుడగు సర్ హ్యూరోజ్ దొరగారిని నియమించి ఆయనకు సర్వసేనాధిపత్య మిచ్చెను.

1857 వ డిశంబరు 17 వ తేదీన సర్‌హ్యూరోజ్ దొరగారు సేనానాయకత్వము స్వీకరించిరి. యుద్ధమునకుబోవు మార్గమును విచారించి వేరువేరు మార్గముల సైన్యములు నడుపవలసిన క్రమమును దెలిపెను. క్రమక్రమముగా సర్‌హూరోజ్ దొరగారు తమసంగ్రామ కౌశలమందరునుం గొనియాడ విప్లవవీర సైన్యములపాలయిన భూము లనేకములు గెలిచి, ఝాశీని గెలుచుతలంపున నచటికి 14 మైళ్ళ సమీపమున తనసైన్యములను విడియించిరి. వారచటనుండి ఝాశీ వర్తమానముల నరయుచు, 1858 వ మార్చి 21 వ తేదీని ఝాశీపొలిమేరం బ్రవేశించి పురరచన నరసి తదనుసారముగా సైన్యములను యుద్ధమున కాయత్తము చేసిరి.

అప్పుడు శౌర్యరాశియగు రాణిగా రాగ్రహించి యిక నింగ్లీషువారితో పొసగదని తెలిసికొని యుద్ధసన్నాహము చేయసాగెను. నధేఖాతోడ రణ మొనర్చునపుడుంచిన విశేష సైన్యమున కనేక స్థలములనుండి పర తెంచివచ్చిన స్వాతంత్ర్య