పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరుల సైన్యములు తోడుపడెను. రాణీగారి సైనికులలో శూరులగు ఠాకూరులోకులును, విశ్వాసార్హులగు పఠాణులును విశేష ముండిరి. ఆసేనాధిపత్యమునంతను రాణిగారు తామేస్వీకరించి తగినబందోబస్తు చేయసాగిరి. ఝాశీకోట మిగుల విశాలమైనదియు, నభేధ్య మగునదియునై యుండెను. అచట గొప్పగొప్పబురుజు లండెను. ఆకిల్లాలో విశేషదినములనుండి నిరుపయోగములైయున్న యనేకఫిరంగులను రాణిగారు బాగుపరచి బురుజులపై కెక్కించిరి. ఒక్కొక్కఫిరంగి కొక్కొక్క యుద్ధకలానిపుణుని నియమించిరి. ఇట్లామె తననేర్పుమెయి సేనలను నడుపుచు యుద్ధసన్నద్ధురా లాయెచు.

ఈ ప్రకార ముభయసైన్యములును యుద్ధసన్నద్ధములై 23 వ తేదీని సంగ్రామమున కారంభించిరి. ఆ దినము శత్రువులు ఝాశీకిల్లాను సమీపింప యత్నించిరి. కాని కోటలోని వారి యాగ్నేయ బాణప్రవృష్టి వారి కసహ్యమయినందున సమీపింపజాలకపోయిరి. ఆ రాత్రి యింగ్లీషుసైనికులు కొందరు గ్రామము సమీపించి యచట నాలుగు స్థలముల బురుజు లేర్పరచి వానిపై ఫిరంగుల నునిచిరి. ఝాశీలోనివారును ఆ రాత్రి యంతయు యుద్ధఒరయత్నమే చేయుచుండిరి. 24 వ తేదినాడు సహిత మింగ్లీషుసైన్యంబులే దైన్యంబు నొందెను. 25 వ తేది ప్రాత:కాలముననే యింగ్లీషు సైన్యంబుల నుండి కిల్లా పైనిని, పురము పైనిని శతముఖ బాణవృష్టి కాసాగెను. ఆగోళ మొకటి వచ్చి శత్రుసైన్యములోపడి పగిలి నలుగురైదుగురిని జంపి, పది మందిని గాయపరచుచుండెను. కాన నా దిన మా పట్టణమునం