పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసిన వెంటనే పట్టరానిరోష ముప్పతిల్లనతివేగముగా వాడు ఝాశీని సమీపించెను. లక్ష్మీబాయిగారును నట్లు వర్తమాన మంపి సంగ్రామమునకు సిద్ధముగానుండెను. అపు డామె తాను పురుషవేషముతో సేనాపతిత్వము వహించి ఘోరయుద్ధము చేసి నధేఖాను నోడించి వానియొద్దనుండి లక్షలకొలది ధనము గొని వానితో సంధిచేసెను.

మహారాణి లక్ష్మీబాయిగారి పరిపాలన మల్పకాలమె యైనను ప్రజలకు మిగుల సుఖకరముగా నుండెనట. కాన వారును రాణిగారి శుభమునే కాంక్షింపుచుండిరి. లక్ష్మీబాయి గారికి పురుషవేషముతో దరబారుచేయుట, అశ్వారోహణము చేయుట మిగులప్రియము. కాన నామె అనేకసమయముల యందు బురుషవేషముతోడనే యుండుచుండెను. సాధారణముగా నామె స్త్రీ వేషముతో నుండినను అలంకారము లేమియు ధరియింపక శ్వేతవస్త్రమునే కట్టుకొనుచుండెను.

రాణిగారికి బీదలపై నధిక ప్రేమయుండెను. ఒక నాడామె మహాలక్ష్మీదర్శనమునకుబోయి వచ్చునప్పుడు కొందరు బీదలు మూకలుగా నామె నడ్డగించిరి. దాని కారణ మడుగగా వారు మిక్కిలి చలివలన బాధపడుచుండినందున వస్త్రదానము నపేక్షించి వచ్చిరని రాణిగారికి దెలిసెను. అందుపైనామె వారందరికిని టోపీలు, అంగీలు, గొంగళ్లు మొదలగునవి యిప్పించెను.

మధ్య హిందూస్థానమంతయు నించిమించుగా భారత విప్లవకారుల స్వాతంత్ర్య సైన్యముల స్వాధీన మయినందున నప్పటి హిందూస్థానపు గవర్నర్ జనరల్ లార్డు క్యానింగు