పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లగుటచే నీతని శౌర్య మేమియు వినియోగింపకుండెను. ఇట్లు కొంతవడి పోరాడి తనకు జయముకలుగునన్న యాస సున్నయగుటచే, ఖడ్గతిక్కన యుద్ధభూమినుండిపారి తన గృహమునకు వచ్చెను.

పరుల కోడి తనభర్త పారివచ్చుట విని మానవతియగు నాతని కాంత మిగుల చింతించి, సమయోచితబుద్ధిగలది యగుటచే పెనిమిటి వచ్చులోపల మరుగు స్థలమునందు స్నానజలముంచి నీళ్లబిందెకు పసపుముద్ద యంటించెను. ఇట్లు స్త్రీలు స్నానము చేయుటకు నావశ్యకమగు వస్తువు లచ్చట నుంచి యామె భర్తరాగానే యాదరింపక తిరస్కారముగా స్నానము చేయుడని చెప్పెను.

తిక్కన తనభార్య ముఖమునందలి తిరస్కారభావమును గని యపుడేమియు ననక, స్నానమున కరిగెను. అచట నాడువారి కుంచునట్లొకమంచ మడ్డముగానుంచి, నీళ్లబిందెకు పసుపు ముద్ద యద్దుట గని, తిక్కన యది తాను యుద్ధమునుండి పారివచ్చినందుకు భార్య తనను దిరస్కరించుటకై చేసిన పనియని తెలిసికొనెను. అయినను ఆయన యంతటితో నూరకుండక తన భార్యను బిలిచి యిది యేమియని యడిగెను. అంతనా వీరపత్ని యాతనికి పౌరుషము కలుగుటకై ఈ పద్యము జదివెను-

క. పగరకు వెన్నిచ్చినచో| నగరే నిను మగతనంపు నాయకులందున్ ?
   ముగురాడువారమైతిమి| వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్ ?

ఇదివరకు అత్తకోడండ్ర మిద్దరమే యింట స్త్రీల ముంటిమి. ఇప్పుడు మీరు యుద్ధము వదలి పారివచ్చినందునస్త్రీ