పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంత నొక్కసారి కలయజూచెను. తన కిస్టుడగు పృథివీ రాజచటికి రాలేదనియు, ఆయనను బరిహసించుట కాయన ప్రతిమనొక దానిని జేసి ద్వారమునందుంచిరనియు నామె కంతకుపూర్వమే తెలిసియుండెను. అందువలన నా బాల యొక గడియవరకే యోచించి, తుదకు దృడనిశ్చయురాలై, తిన్నగా నడిచి డిల్లీశ్వర ప్రతిమను సమీపించి యామూర్తికంఠమునందు బుష్పహారమును వేసెను. దాని గనినతోడనే సభయందంతట నొకటే కల్లోల మయ్యెను. జయచంద్రుడిట్టి యవమానమును సహింపజాలక కోపావేశపరవశుడై "దుష్టురాలగు దీనిని గారాగృహమునందుంచు"డని యాజ్ఞాపించెను. అంత రాజులందరు నిరాశనుబొంది తమతమ నగరములకు జనిరి. ఇదియే యీ దేశమున జరిగిన కడపటి స్వయంవరము.

ఈ సంగతి యంతయు విని పృథివీరాజు పరమానంద భరితుడయ్యెను. జయచంద్రుడు తనను బరచిన యవమానమును సంయుక్త తనయందు గనపరచిన ప్రేమయు నేకీభవించి తన్ను ద్వరపెట్ట పృథివీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్ర వెడలెను. ఇట్లాయన శూరులగు యోధులతో గనోజిపట్టణము సమీపమున విడిసెను. అచటనున్న కాలముననే యొక రాత్రి మిగుల రహస్యముగా పృథివీరాజు సంయుక్తనుగలిసి గాంధర్వ విధిచే నామెను వరియించెను.

వీరి వివాహవార్త యొకరిద్దరు దాసీలకు దప్ప నితరుల కెంతమాత్రము దెలియదు, పృథివీరాజు వచ్చి తన గ్రామము బైట విడియుట విని యాతనినిబట్టి తెండని జయచంద్రుడు