పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననేకపర్యాయములు పృథివీరాజు పరాక్రమములను విని రూపము చూచియున్నందువలన నాతనినే వరించెదనని మనంబున నిశ్చయించుకొనియెను. జయచంద్రుడు తన కూతునకు దగినవరుడు దొరకవలయునని స్వయంవరము చేయనెంచెను. పుత్రికా వివాహమునకు బూర్వము రాజసూయముచేయ నిశ్చయించి సకలదిక్కుల రాజులకును వర్తమానము లంపెను. జయచంద్రుడు పరాక్రమవంతు డగుటవలన నితర మాండలిక రాజులందరాయన పిలిచినదినమునకు వచ్చి కనోజనగరము నలంకరించిరి. పృథివీరాజుమాత్రము జయచంద్రునితోగల పూర్వవైరమువలన నాయుత్సవ మునకు రాకుండెను. అందునకు జయచంద్రుడు మిగుల కోపించి యాతనితో గల వైరము వలన, పృథివీరాజు ప్రతిమ నొకదానిని జేయించి, యాప్రతిమను ద్వారపాలకుని స్థలమునందుంచి తనపగ సాధించెను. యజ్ఞమువిధిప్రకారము జరిగినపిదప స్వయంవరోత్సవ మారంభ మయ్యెను. అప్పుడనేక దేశాధీశు లొకచోట నానందముగా గూడినందున కనౌజపట్టణము మిగుల నందముగా గానుపించెను.

రాజాజ్ఞప్రకారము మంత్రులు మండపము నలంకరించి రాజుల నందరిని వారి వారికి దగుస్థానముల గూర్చుండబెట్టిరి. అటుపిమ్మట సంయుక్తచేత బుష్పమాలను ధరియించి సఖీ సహితమయి యా మండపమునకు వచ్చెను. రాజకన్య సభకు రాగానే రాజపుత్రు లందరి చూపులునామెవైపునకే మరలెను. ప్రతిభూపతియు నామె తనను వరియింపవలెనని కోరుచుండెను. సంయుక్త మిగుల గంభీరదృష్టితో రాజలోకము