పుట:Abaddhala veta revised.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగంలో పరిశోధనలు, రుజువులు, ప్రగతిని కొంత వరకు క్రైస్తవులు స్వీకరించి, మత ఛాందసాన్ని సవరించారని, ఇంకా ముస్లింలు ప్రారంభించ లేదని రచయిత అన్నారు. అయితే శాస్త్రీయ ఉప్పెనకు కొరాన్ తట్టుకోలేదని కూడా ఆయన అన్నాడు.

రెండో అధ్యాయంలో ఇస్లాం పుట్టుపూర్వోత్తరాలు, యూదు క్రైస్తవ మతాల, గ్రంధాల ప్రభావం సుదీర్ఘంగా చర్చించారు. విగ్రహారాధన వ్యతిరేకించే ముస్లింలు మక్కాలో "కాబా" నల్లరాతిని ప్రతిష్టించి, ఆరాధించే రీతులు ఎలా వచ్చాయో వివరించారు. ఇది ఆకాశంనుండి వూడిపడిన ఉల్క అని కీ॥శే॥కారల్ శాగన్ రాశారు. మక్కా మీదుగా ఎమెన్, సిరియా వెళ్ళే ఒంటె వ్యాపారస్తులు కాబావద్ద ఆగి, పక్కనే వున్న ఊట బావి నీటితో సేద తీర్చుకొని వెళ్ళేవారని రచయిత పేర్కొన్నారు.

మూడో అధ్యాయంలో మూలాధారాల పరిశీలనలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, రచయిత కూలంకషంగా చూచారు.ఖురాన్ గురించి ముస్లిం సనాతనులు చెప్పే అబద్ధాలు మొదలు, మహమ్మద్, సంప్రదాయాల వెనుక ఎంత వరకు నిలబడగల చరిత్ర వుందో చూపారు.

నాలుగో అధ్యాయంలో మహమ్మద్ సందేశాలను రచయిత విప్పి చూపారు. మహమ్మద్ గురించి రాసిన వాళ్ళలో చాలా మంది వ్యతిరేకులు కాదని, అయినా వాస్తవాలు తెలిపారనీ, ముస్లింలు అదంతా గ్రహిస్తే అంత అభిలషించరని రచయిత అన్నారు. మహమ్మద్ లో మక్కా కాలంలో మహమ్మద్ చిత్త శుద్దిగల మత నమ్మకస్తుడుగా వున్నాడు.

ఖురాన్ గురించి ఐదవ అధ్యాయం విపులంగా పరిశీలిస్తుంది. ముస్లింలు ఖురాన్ పవిత్రమనీ, దైవదత్తమనీ, సత్యమనీ నమ్ముతారు. అలాంటి గ్రంథంలో పరస్పర విరుద్ధాలు, ప్రక్షిప్తాలు, భిన్న పాఠాంతరాలు వుండడాన్ని రచయిత చూపాడు. ఖురాన్ సూచించే శిక్షలో మానవహక్కుల్ని ఎలా ఉల్లంఘిస్తున్నాయో రచయిత పేర్కొని ఇస్లాం దేశాలన్నీ మానవహక్కుల పత్రం అంగీకరించిన విషయం గుర్తు చేశారు. బైబిల్ వలె ఖురాన్ కూడా సృష్టివాదం ఒప్పుకోగా, సైన్స్ అందుకు విరుద్ధంగా పరిణామ వాదానికి సాక్ష్యాధారాలు చూపుతున్నది. అలాగే జీవంకూడా.

ఇస్లాంలో నియంతృత్వం ఎలా వుందో రచయిత మరొక అధ్యాయంలో చూపాడు. ఇస్లాం అంతా విధులతో కూడినది. పుట్టిన దగ్గరనుండీ చనిపోయే వరకూ జీవితాన్ని అదుపులో పెట్టడం ఇస్లాం పని. కనుకనే ఇస్లాంలో సెక్యులరిజం లేదు. అంటే మతం-రాజ్యం విడిగా చూడడం లేదు. ఇస్లాం యావత్తూ నాలుగు స్థంభాలపై ఆధారపడుతుంది. ఖురాన్, సున్నా, (ప్రవక్త ప్రవచనాలు), వీటిని గురించి ఒక అంగీకారానికి వచ్చిన ముస్లిం పండితుల మాటలు, ఉపమానాలతో కూడిన వాదన. రచయిత ననుసరించి ఖురాన్ 7-9 శతాబ్దాల మధ్య రాసిందే. ఇందులో యూదు, క్రైస్తవ, జొరాస్ట్రియన్, సమారిటన్ నుండి స్వీకరించి చేర్చినవి చాలా వున్నాయి. ఇందులో శాస్త్రీయంగా నిలబడని దోషాలు,వ్యాకరణ భాషా దోషాలు, కాలదోషం,