పుట:Abaddhala veta revised.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరస్పర విరుద్ధ విషయాలు, అసంబద్ధాలు పేగన్ల పట్ల అసహనం, హింస, హత్య, స్త్రీపురుష అసమానతలు, బానిసత్వాన్ని అంగీకరించం, అమానుష శిక్షలు, మానవ వివేచన పట్ల జుగుప్స వున్నాయి. దైవదత్తమైన వాటిలో యిలా వుండడం అర్థం లేనిదని రచయిత ఉద్దేశం. ఉదారత, తల్లి దండ్రులపట్ల గౌరవం వంటివి వున్నప్పటికీ అసంబద్ధాల మధ్య అవి మునిగిపోయాయి.

ఇస్లాంలో పురోహిత వర్గం లేదని ముస్లిం పండితులు చెబుతారు. కాని ఇస్లాంకు సరైన వ్యాఖ్యానం చేసే పేరిట అన్ని చోట్ల పురోహిత వర్గం తిష్ఠ వేసి పెత్తనం చేస్తున్నది. ఉలేమాలు వీరే. ముస్లింలలో నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధం పెంపొందకుండా నిరోధిస్తున్నది యీ ముల్లాలే. వెయ్యేళ్ళ క్రితం ఆనాటి పరిస్థితులలో వచ్చిన హరియా చట్టాలు నేడు చారిత్రకంగా చూడాలేగాని, తుచ తప్పకపాటిస్తే నైతిక ప్రగతి వుండదని రచయిత ఘంటా పధంగా చెప్పారు.

మానవహక్కులు :ముస్లిం దేశాలు ఇస్లాంను పాటిస్తూనే,మానవహక్కుల్ని అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమాఖ్యలో వీరు సభ్యులే. కాని ఆచరణలో అడుగడుగునా మానవ హక్కుల్ని ఇస్లాం అడ్డు కొంటున్నది. ఇస్లాంలో స్త్రీలు పురుషులు సమానం కాదు. పురుషుడి సాక్ష్యంలో సగం విలువ మాత్రమే స్త్రీ సాక్ష్యానికి వుంటుంది. స్త్రీలకు అన్ని విధాల స్వేచ్ఛను ఇస్లాం పరిమితం చేస్తుంది. ముసుగు వేసుకోమంటుంది. మానవ హక్కుల ప్రకారం స్త్రీ పురుషులకు హక్కులు స్వేచ్ఛ, భావాలు సమానంగా వుండాలి. కాని ఇస్లాం ప్రకారం స్త్రీలు ముస్లింలు కాని వారిని పెళ్ళి చేసుకోరాదు. ముస్లిం దేశాలలో నివశించే ముస్లిమేతరులకు, కోర్టులో గాని, మరెక్కడా సమాన హక్కులు లేవు. ముస్లిం దేశాలలో నాస్తికులు, నమ్మకం లేనివారు చంపబడాల్సిందే. ముస్లిం దేశాలలో ఇతరమతాల వారు తమ ప్రార్ధనలు చేసుకోడానికి, బాహాటంగా గుడి,చర్చి నిర్మించడానికి, పవిత్ర గ్రంధాలు చదవడానికి వీల్లేదు. మానవహక్కులు బానిసత్వాన్ని వ్యతిరేకిస్తుండగా ఇస్లాం గుర్తిస్తున్నది. బానిస స్త్రీలతో లైంగిక సంపర్కం ముస్లింలకు ఖురాన్ అనుమతిస్తున్నది.(సురా 4:3)

మానవహక్కుల ప్రకారం క్రూరమైన, అమానుషమైన శిక్షలు, మానవత్వాన్ని దిగజార్చే శిక్షలు వుండరాదు. ఇస్లాం ప్రకారం కొరడాతో బహిరంగంగా కొట్టడం, చేతులు కాళ్ళు నరకడం, రాళ్ళు విసరి చంపడం అనుమతిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమని మానవహక్కులు చెబుతుండగా, ఇస్లాం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. ముస్లింలలో ఇతరులు మతం మార్చుకొని చేరవచ్చు కాని ముస్లిం మతం మార్చుకొని వేరేపోడానికి వీల్లేదు.

ప్రజాస్వామ్యం-ఇస్లాం పొసగనివని, మానవహక్కులకు ఇస్లాంలో అవకాశం లేదని రచయిత వివరంగా చెప్పారు. ముస్లింలు ఇతర ప్రపంచంతో పాటు ముందుకు సాగడానికి, మతాన్ని రాజ్యాన్ని విడదీసే సెక్యులరిజం అవసరమని రచయిత అన్నారు.

స్త్రీలు-ఇస్లాం:స్త్రీలపట్ల ఇస్లాం ఎలా ప్రవర్తిస్తున్నదో చాలా వివరంగా రచయిత ఒక అధ్యాయంలో