పుట:Abaddhala veta revised.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎ.జి.కె. తన పర్యటనానుభవాలు ప్రజలకు సభాముఖంగా వివరించాడు. పుస్తకం ప్రచురించాడు.

ఎ.జి.కె. వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి హ్యూమనిస్టు ఉద్యమంలో వుండడం, బాగా పునాదులు వేయడానికి తోడ్పడింది.

ఎ.జి.కె.పై సమగ్ర పరిశీలన అవసరం. విపుల గ్రంథం వెలువడితే భవిష్యత్తులో హేతువాదులకూ హ్యూమనిస్టులకూ చాలా మార్గదర్శకంగా వుంటుంది.

స్టడీకాంపులలో ఎ.జి.కె. నిర్భయంగా ఎం.ఎన్.రాయ్ ను కొన్ని సందర్భాలలో ఎదుర్కొన్నారు. ఒకసారి కొరియా విషయమై అలాంటి వివాదంలో తీవ్ర అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఉభయులూ ఒక రోజంతా ముభావంగా, ఎడముఖం పెడముఖంతో వున్నారట. ఇది గమనించిన ప్రముఖ హ్యూమనిస్టులు ఉభయుల్నీ కలిపి వాతావరణం చల్లబరిచారట.

త్రిపురనేని రామస్వామి - ఎం.ఎన్.రాయ్ భేటి తెనాలిలో జరిగినప్పుడు రాయ్ అసంతృప్తితో రామస్వామి ఆర్యసమాజ్ వాసనలు పోగొట్టుకోలేనివాడిగా పేర్కొన్నట్లు ఎ.జి.కె. చెప్పారు.

కాంగ్రెసు అధ్యక్ష పదవికి పోటీచేసిన ఎం.ఎన్.రాయ్ పొరపాటున గెలిచి వుంటే రాడికల్ హ్యూమనిజం ఎటు పొయ్యేదోనని నవ్వుతూ ఎ.జి.కె.వ్యాఖ్యానించేవారు.

ఎంఎన్.రాయ్ ను చివరిదాకా కమ్యూనిస్టు భయం వెంటాడిందనీ, చంపుతారనే అనుమానం వుండేదనీ, రాయ్ ను దగ్గరగా పరిశీలించిన ఎ.జి.కె. అంటుండేవారు.

ఎ.జి.కె.ను గురించి తెలుసుకోవలసిందీ, ఉద్యమానికి ఆయన చేసింది భావితరాలకు చెప్పల్సింది చాలా వుంది.

రోశయ్యను మార్చి ఎ.జి.కె.

సుప్రసిద్ధ టీచర్ గా పేరొందిన ఎలవర్తి రోశయ్యగారు ఎ.జి.కె.కు మంచి స్నేహితులు. రోశయ్యగారు గుంటూరు ఎ.సి.కాలేజి, జె.కె.సి.కాలేజి, భీమవరం కాలేజీలలో పనిచేశారు. విశిష్ట లెక్చరర్ గా పేరొందారు. కరడుగట్టిన గ్రాంధికవాది. అలాంటి రోశయ్యగారు విద్యార్థి దశలో పిలక పెంచి, చాదస్తంగా నన్నయగారు, తిక్కనగారు,ఎర్రనగారు అంటూ కవిత్వమంటే చెవికోసుకునేవారు. ఎ.జి.కె.గుంటూరు హాస్టల్ లో ఒకనాడు తెల్లవారుజామున రోశయ్య పిలక కత్తిరించేశాడు. అపచారం అంటూ రోశయ్య వాపోతుండగా పేరుచెప్పకుండా త్రిపురనేని రామస్వామి సూతపురాణంలో ఒక పద్యం చదివి వినిపించాడు. రోశయ్యగారు ఆకర్షితుడై బాగుంది, ఎవరు రాశారు? అని అడిగాడు. ఎ.జి.కె. చెప్పకుండా మరో పద్యం చదివి, అలా రోశయ్యను ఆకర్షించారు. చివరకు పేరు చెప్పగా రోశయ్యగారు ఆశ్చర్యపోయి, ఆ తరువాత రామస్వామి కవితలన్నీ చదివారు. అప్పటినుండే చాదస్తం తగ్గించుకున్నారు. లెక్చరర్ గా రోశయ్యగారు