పుట:Abaddhala veta revised.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎందరో విద్యార్థులకు మానవవాదాన్ని, ఎం.ఎన్.రాయ్ ను పరిచయం చేశారు. ఎ.జి.కె., రోశయ్యలు మంచి సన్నిహిత మిత్రులుగా చివరి వరకూ కొనసాగారు.

ఎ.జి.కె. ఎందరో కవుల్ని, గాయకులను, కళాకారులను ప్రభావితం చేశారు. కొండవీటి వెంకటకవి, అత్తోటరత్న కవి, కొత్త సత్యనారాయణ, వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య మొదలైన వారెందరో యీ పట్టికలో వున్నారు.

ఎ.జి.కె. సెక్యులర్ వివాహాలు చేయిస్తూ, ప్రతి వివాహంలో సరికొత్త ఉపన్యాసం చేసి, యువతను ప్రోత్సహించేవారు. నేను విన్న చివరి పెళ్ళి ఉపన్యాసం చీరాలలో,కీ॥శే॥రాజారెడ్డి కుమారుడు భాస్కర్ పెళ్ళి ఉపన్యాసం అద్భుతం. బహుశ అది రికార్డు అయివుంటే భాస్కర్ వద్ద (ఒంగోలు) లభించవచ్చు.

అధికారంలో వున్న వారిని ఎ.జి.కె.ఖాతరు చేసేవారు కాదు. గవర్నర్ గా వున్న చందూలాల్ త్రివేది ముఖ్యమంత్రిగా వున్న నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్యలు ఎ.జి.కె.నిశిత విమర్శలకు గురైనవారే.

అధికారంలో లేనప్పుడు ప్రజానాయకులను గౌరవించడం ఎ.జి.కె.ఆనవాయితీ. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఆచార్యరంగా వంటివారిని అలానే సత్కరించారు.

రాజ్యాంగం 19వ సవరణపై ఎ.జి.కె.బాపట్ల ఉపన్యాసం రాజాజీని ముగ్ధుడిని చేసింది. ఆ విషయమై ఎ.జి.కె.ని శ్లాఘించారు.

నీలం సంజీవరెడ్డికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అక్రమ పద్ధతిలోగౌరవ డాస్టరేట్ ప్రదానం చేయగా, సెనెటర్ గా వున్న ఎన్.విజయరాజకుమార్ దావా వేశాడు. ఆ కేసును ఎ.జి.కె. చేబట్టి నెల్లూరులో వాదించారు. ముఖ్యమంత్రిపై అలా పోరాడిన వ్యక్తి ఎ.జి.కె.

గుండెపోటు వచ్చి మంచంలో వున్న ఎ.జి.కె. కీ॥శే॥ఎ.బి.షా నేనూ కలసి వెళ్ళి ఆరోగ్యం విషయమై అశ్రద్ధ వహించవద్దన్నాం, చికిత్సకు మద్రాసు వెళ్ళమన్నాం, సరేనన్నాడు. కాని మంచంలో వున్నా కేసుల విషయం సంప్రదించడం, విశ్రాంతి లేకుండా చేసిన వాతావరణంలో ఎ.జి.కె. అకాలమరణం చెందాడు. అది హ్యూమనిస్టు ఉద్యమానికి పెద్దలోటు, కోలుకోలేని దెబ్బ తగిలింది!

- హేతువాది, మే 2000
టంగుటూరి ప్రకాశం

మన సంప్రదాయం ప్రకారం కీర్తిశేషులైన వ్యక్తిని మితిమీరి శ్లాఘిస్తుంటాం. దీనివలన ఆ వ్యక్తిలోని మంచిచెడులను శాస్త్రీయంగా అంచనా వెయడానికి వీల్లేకపోతునంది. రాజకీయాలలోనూ, మతరంగంలోనూ ఈ విధమైన వీరారాధన బాగా పాతుకుపోయింది.