పుట:Abaddhala veta revised.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్కూలువారు సిరసావహించారు. లియొనార్డో హోమో సెక్సు గలవాడని ఫ్రాయిడ్ ఉద్దేశం. ఈ నేరం రుజువు కానందుకు ఆనాడు ఇటలీ కోర్టు లియొనార్డోను వదిలేసింది గాని, ఫ్రాయిడ్ ను మాత్రం వదల్లేదు.

ఒడిపస్ కాంప్లెక్స్:

మొదటిసారిగా 1910 ఒడిపస్ కాంప్లెక్స్ ప్రయోగం చేసిన ఫ్రాయిడ్ సైకో ఎనాలసిస్ లో దీనికి అత్యంత ప్రాధాన్యత యిచ్చాడు. పిల్లవాడు తల్లిని కోరడం,కూతురు తండ్రిని కోరడం యిందలి మూలసూత్రం ఒడిపస్ కాంప్లెక్స్ ను అవగాహన చేసుకోని వారికి నరముల జబ్బు వస్తుందని ఆయన చెప్పాడు. ఒడిపస్ కాంప్లెక్స్ లో కేవలం సూచనల సంజ్ఞ, చిహ్నం మాత్రమే వున్నదని, ఇందులో తల్లి అనేది అందుకోలేనిదిగా భావించాలని, తండ్రి అనేది మనలోని అంతరభావనగా స్వీకరించాలని, దీనినుండి బయటపడి స్వతంత్రుడిగా మారాలని యూంగ్ రాశాడు. ఈ వ్యాఖ్యానాన్ని ఫ్రాయిడ్ తీవ్రంగా నిరసించి ఖండించాడు. యూంగ్ కొత్త మత నైతికపధ్ధతి సృష్టించాడన్నాడు. సైకో ఎనాలసిస్ ను ఉపమానంగా భావించడం క్షమించరాని నేరంగా ఫ్రాయిడ్ చెప్పాడు. నరాలజబ్బు అంటే ఏమిటో ఫ్రాయిడ్ నిర్ధారణగా చెప్పలేడుగాని, కారణాలు అన్వేషించడంలో ఒడిపస్ కాంప్లెక్స్ ను పేర్కొన్నాడు. కనుక అదేమిటో తెలుసుకోవడం అవసరం.

ఒడిపస్ గాధ:

థీబిస్ రాజు లూయిస్ కు పిల్లలులేరు. ప్రవక్త డెల్ఫిక్ ను సంప్రదిస్తే, తనకూ తన భార్య జూకాస్తాకు పుట్టే కొడుకు తనను చంపుతాడని చెప్పింది. కనుక భార్యను దూరంగా వుంచాడు. ఆమె ఆగ్రహించి లూయీకి తప్పత్రాగించి తనతో సంభోగం జరిపిస్తుంది. తొమ్మిది మాసాలకు కొడుకు పుడతాడు. కొడుకును దాయానుండి లాక్కెళ్ళి కాళ్ళకు మేకులుకొట్టి, కట్టేసి, కొండల్లో పారేయిస్తాడు లూయీ. ఒక గొర్రెలకాపరి ఆ బాలుడ్ని కాపాడి ఒడిపస్ అని పేరు పెడతారు. మేకులు దిగిన కాళ్ళు ఒంకరపోయినందుకు యీ పేరు వచ్చింది. ఆ బాలుడిని తీసుకొచ్చి పిల్లలులేని కొరింత్ రాజు పోలిబస్, రాణి పెరిబోసియాలకు యిస్తాడు. పెరిగిన తరువాత ఒడిపస్ తన తల్లిదండ్రులను పోలివుండనందుకు స్నేహితుడు వెక్కిరిస్తాడు. ఒడిపస్ వెళ్ళి డెల్ఫిక్ ఆరకిల్ ను తన భవిష్యత్తు గురించి అడుగుతాడు. నీ తండ్రిని చంపి తల్లిని పెళ్ళిచేసుకుంటావని ప్రవక్త చెబుతుంది. తన తల్లిదండ్రులను అతిగా యిష్టపడిన ఒడిపస్ యిది విని, కొరింత్ తిరిగి వెళ్ళకుండా, డాలిస్ వైపు పోతుండగా రధంపై పయనిస్తున్న లూయీ తారసిల్లాడు. తప్పుకోమని లూయిస్ అరుస్తాడు. పెద్దవాళ్ళకు గౌరవం చూపమంటాడు. ఒడిపస్ వినకుండా, తన తల్లిదండ్రులు, దేవుళ్ళే తనకు గౌరవ పాత్రులంటాడు. లూయిస్ రధం పోనివ్వమంటాడు. ఒడిపస్ కాళ్ళమీదుగా రధం కదలగా, ఆగ్రహంతో రధసారధిని, రాజు లూయిస్ ను ఒడిపస్ చంపేస్తాడు. తరువాత థీబస్ కు వెళ్ళిన ఒడిపస్, అక్కడున్న స్పినిక్స్ వేసిన చిక్కుప్రశ్నలకు