పుట:Aandhrakavula-charitramu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయం

శ్రీ కందుకూరి వీరేశలింగంగారు ఆంధ్ర కవుల చరిత్ర రచనను 1886-వ సంవత్సరంలో ఉపక్రమించి 1894-వ సంవత్సరంలో పరిపూర్తి చేసినారు.వారు కవుల చరిత్రను వ్రాస్తూ ఎప్పటికప్పుడు " వివేకవర్ధని ", "చింతామణి", పత్రికలలో ప్రచురిస్తూ వచ్చారు.

ఆంధ్రకవుల చరిత్ర ప్రథమభాగమును నేను 1887-వ సంవత్సరమునందు ప్రకటించితిని" అని శ్రీ కందుకూరి వారు తమ జీవితచరిత్రలో పేర్కొన్నారు.1894-వ సంవత్సరములో ఒకసారి, 1897-వ సంవత్సరములో మరి యొక సారి ప్రచురించినారు.

ఆంధ్రకవుల చరిత్రను - పూర్వాంధ్రకవులు - మధ్యకాలపుకవులు-ఆధునిక కవులు- అని మూడు భాగాలుగా విభజించి 189౦-వ సంవత్సరములో ఒకే ఒక్క సంపుటముగా వెలువరించినారు. ఆనాడు ఆంధ్రకవుల చరిత్రమీద వచ్చిన సమీక్షల్ని పరికించి, పండితమిత్రుల సలహాలను పాటించి శ్రీ వీరేశలింగంగారు కొన్ని మార్పుల్ని చేర్పుల్ని చేసి నన్నపార్యుని మొదలు కవిరాక్షసుని వరకు పూర్వాంధ్రకవులుగా విభజించి 1917-వ సంవత్సరంలో ప్రథమభాగముగా ప్రకటించారు. వృద్ధాప్యకారణముచేత ఆంధ్రకవుల చరిత్ర తక్కిన రెండుభాగాల్ని శ్రీ వీరేశలింగంగారు తమచేతిమీదుగా పరిష్కరించ లేకపోయినారు.

శ్రీ వీరేశలింగంగారికన్నా మున్నుగా గురుజాడ శ్రీరామమూర్తిగారు, ఆంధ్రకవుల జీవితాల్ని రచించి 1876 వ సంవత్సరంలోనే ప్రచురించారు. పెద్దాపురంనుండి ప్రకటింపబడే " శ్రీ ప్రబంధ కల్పవల్లి " అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. వారికవుల జీవితరచనలో కాలక్రమాన్ని పాటించలేదు. భారతాంధ్ర కవులు-రామాయణాంధ్రకవులు-ఆంధ్రపంచకావ్యకవులు- ఇత్యాదిగా విభాగించి రచించారు. ఆ కవుల జీవితరచన సమగ్రంగా లేక