పుట:Aandhrakavula-charitramu.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

584

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

సహితము గంగయనుట గలదు. ఇట్లు రెండు గంగలకును భేదము తెలియుటకయి యు తరమున నున్న గంగను (భాగీరథిని) ఉత్తరగంగ యనియు, దక్షిణమున నున్న గంగను (గోదావరి యనఁబడెడు గౌతమిని) దక్షిణగంగ యనియు వ్యవహరింతురు. పోతన్న స్నానార్ధము పోయినది యిదే గంగ యయి యుండును? కొన్ని దినముల ప్రయాణములో నుండక బహదూరమున నా కాలమునఁ గొన్ని మాసముల ప్రయాణములో నుండినదగుటచేత నుత్తరగంగ యయి యుండదు. అది తప్పక కొన్ని దినముల ప్రయాణములో నున్న దక్షిణగంగ యనఁబడెడు గోదావరి యగుటకు సందేహము లేదు. ఒంటిమెట్టకు సమీపమున గోదావరీనదీ లేకుండుటయు గోదావరినది యోరుగంటికి సమీపముననే యుండుటయు విచారింపఁగా, బమ్మెరపోతనామాత్యుని వాసస్థానమైన యేకశిలానగర మోరుగల్లే కాని యొంటిమెట్టకా దని నిశ్చయ మగుచున్నది. గోదావరికి గంగ యన్న పేరు లోకవ్యవహారమునందు మాత్రమేకాక పూర్వకాలమునుండియు గ్రంధముల యందుసహిత ముండిన క్రింది నిదర్శనములవలన దెలిసికొనవచ్చును.

1. "దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన గోదావరియు జగదాదియైన అని భారతాదిపర్వమున నన్నయ భట్టారకుఁ డర్జునుని తీర్థయాత్రాసంబంధమున గోదావరిని దక్షిణగంగ యని చెప్పెను.

2. సీ. ఉండు నే వీట మార్కండేయ ముని నాథ
                     సజ్జలింగ మనంగ శాసనుండు
       ప్రవహించు నే వీటి పశ్చిమ ప్రాకార
                     మొరసి గంగమ్మ సాగరముకొమ్మ
       యావిర్భవించినాఁ డే వీటికోటలో
                     బలభేది మదనగోపాలమూ ర్తి
       పాలించు నే వీటి ప్రాగుదక్కోణంబు
                     నుమప్రోది శ్రీమల్ల గూరిశక్తి