583
బమ్మెర పోతరాజు
శిలా నగరము సుప్రసిద్ధమయిన యోరుగల్లే గాని యప్రసిద్ధనుయిన యొంటిమెట్ట గాదని నిస్సందేహముగా సిద్దాంత మగుచున్నది. శబ్దార్ధము నటుండనిచ్చి యిఁక వాస్తవార్ధమునకు వత్తము.
బమ్మెర పోతనార్యుఁడు తాను భాగవతంబు రచింపఁపూనుటకుఁ గారణము. నా గ్రంథములోనే యీ క్రింది వాక్యములలోఁ దెలిపియున్నాఁడు.
"మదీయపూర్వజన్మసహస్రసంచితతపఃఫలంబున శ్రీమన్నారాయణకథా ప్రపంచ విరచనాకుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాక గనుంగొని సజ్జనాను మతంబున నభ్రంకష శుభ్రసముత్తుంగ భంగ యగుగంగకుంజని క్రుంకులిడి వెడలి మహనీయ మంజులపులినప్రదేశంబున మహేశ్వరధ్యానంబు నేయుచుఁ గించిదున్మీలితలోచనుడనయి యున్నయెడ ........ మెఱుఁగు చెంగట నున్న మేఘంబుకై వడి ... ... విపులభద్రమూర్తియైన రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా కన్నుఁగవకు నేదురఁ గానఁబడియె. ఏను నారాజశేఖరుం దేఱిచూచి భాషింపయత్నంబు సేయు మెడ నతండు నే రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెలుగుచేయుము. నీకు భవబంధములు తెగునని యానతిచ్చి తిరోహితుండయిన సమున్మీలితనయనుండనయి వెఱఁగుపడి చిత్తంబున...... ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవతపురాణపారిజాతపాదపసమాశ్ర యంబున హరికరుణా విశేషంబునఁ గృతార్థత్వంబు సిద్ధించె నని బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్నిదినంబుల కేకశిలా నగరంబునకుం జనుదెంచి యందు గురు వృద్దుబుధబంధునానుజ్ఞాతుండనై.. ” ఇతడు మొదటినుండియు శైవుఁ డయి యుండియు నొక చంద్ర గ్రహణసమయమునందు గంగాస్నానమునకుఁ బోయినప్పు డక్కడ నాకస్మికముగా స్వప్నమున రామభద్రుండు ప్రత్యక్ష మయి తన్నామాంకితముగా శ్రీ మహాభాగవతమును దెలుఁగుచేయు మన యానతిచ్చుటచేత భాగవతరచనము నకుఁ బూనెను. ఇతఁడు చంద్ర గ్రహణ స్నానమునకుఁ బోయినగంగ యీతని నివాసగ్రామమునకు సమీపముగా నుండి యుండవలెను. సాధారణముగా భాగీరథిని గంగ యందురు; గౌతమిని