పుట:Aandhrakavula-charitramu.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

469

శ్రీనాథుఁడు

ముందే యల్లాడ రెడ్డి రాజ్యము చేయుచుండఁగానే కాలగోచరుఁడైయుండును. ఈ కొమరగిరిరెడ్డి యక్కయయిన యనితల్లిని తన ద్వితీయపుత్త్రుఁడైన, వీరభద్రారెడ్డికి వివాహము చేసి యల్లాడ రెడ్డి కాటయవేమారెడ్డికి వియ్యంకుఁ డయ్యెను. అల్లాడ రెడ్డి యిట్లు 1426-వ సంవత్సరము వఱకును రాజ్యము చేసి తరువాత రాజమహేంద్రవరరాజ్యము ననితల్లి భర్త యైన వీరభద్రారెడ్డి వశము చేసెను. రాజమహేంద్రవరరాజ్యము నల్లాడ రెడ్డి యేలినను, వీర భద్రారెడ్డి యేలినను, ఆతనియన్న యైన వేమారెడ్డి యేలినను, అందఱును ననితల్లి పక్షముననే యేలిరనుట స్పష్టము.

3. అల్లాడవీరభద్రారెడ్డి

అల్లాడభూపతికి ద్వితీయపుత్రుడైన వీరభద్రారెడ్డి 1426- వ సంవత్సర మన రాజమహేంద్రవర రాజ్యసింహాసనము నధిష్టించి భూపరిపాలనము చేయ నారంభించెను. ఈతని రాజ్యకాలములో 1430-వ సంపత్సరప్రాంత మున శ్రీనాథుఁ డీతని మంత్రి యైన బెండపూఁడి యన్నామాత్యునియొద్దఁ బ్రవేశించి, తరవాత వీరభద్రారెడ్డి యాస్థానకవియయి కాశీఖండము నాతని కంకితముఁజేసి, వీరభద్రారెడ్డి రాజ్యావసానమువఱకును నచ్చటనే యుండెను. రాజమహేంద్రవరరాజ్యము 1443 -వ సంవత్సరముఁనాటికే విజయనగర రాజులపాలయినట్లా సంవత్సరమునందలి ప్రౌఢ దేవరాయల ద్రాక్షారామ శాసనమును బట్టి తేట పడుచున్నది. అందుచేత వీరభద్రారెడ్డి 1440-వ సంవత్సరప్రాంతములవఱకు రాజ్యపాలనము చేసినట్టు కనఁబడుచున్నది వీరభద్రారెడ్డి శాసనములుగాని, అతని యన్నయైన వేమారెడ్డి శాసనములు గాని 1437-38 -వ సంవత్సరమునకుఁ దరువాత గానరావు. వీరభద్రారెడ్డితోనే రాజమహేంద్రవర రెడ్డి రాజ్యమంతరించినది.

ఇంతవఱకును తెనుఁగు దేశమును బరిపాలించిన రెడ్ల చరిత్రమును సంక్షేప రూపమునఁ జెప్పితిని. ఇక రెడ్ల కవీశ్వరుఁ డైన శ్రీనాధుని చరిత్రమును గొంత వివరింపవలసి యున్నది. అతని జన్మస్థల మేదో, అతఁడే కాలము నందుండినవాఁడో, ఏ యే దేశములను దిరిగెనో, ఏ యే పుస్తకముల