పుట:Aandhrakavula-charitramu.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినుకొండ వల్లభరాయఁడు


ఈ కవి నియోగిబ్రాహ్మణుఁడు; విశ్వామిత్రగోత్రుఁడు; తిప్పనార్య పుత్రుఁడు. ఇతడు క్రీడాభిరామ మనుపేర దశరూపకములలో నొకటి యయిన వీధినాటకమును దెనుఁగున రచించెను. తెలుఁగున దృశ్యకావ్యమును రచించుటలో నీతఁడే మొదటివాఁడుగాఁ గనఁబడుచున్నాఁడు. తానీ క్రీడాభిరామమును సంస్కృతమున రావిపాటి తిప్పన్నచే రచియింపఁబడిన ప్రేమాభి రామము ననుసరించి చేసినట్టు కవియే ప్రస్తావనలోఁ జెప్పుకొని యున్నాడు. ఇతc డెంతవఱకు మూలగ్రంథము ననుసరించెనో యెంతవఱకు స్వకపోల కల్పితముగా విరచించెనో తెలియరాదు. క్రీడాభిరామమునందలి వర్ణనము లనేకములు. కవి స్వకపోలకల్పితముగాఁ జేసిన వనియే తోచుచున్నది. ఈ రూపకముయొక్క— ముఖ్యరంగ మోరుఁగల్లు. ఇది కాకతీయ చక్రవర్తులకు రాజధానిగా నుండెను. ఈ రాజ్యమును పాలించిన కాకతీయ చక్రవర్తులలోఁ గడపటివాఁడు 1296- వ సంవత్సరము మొదలుకొని 1323 వ సంవత్సరము వఱకును రాజ్యపాలనముచేసి మహమ్మదీయులచేఁ పట్టుబడి ప్రభుత్వమును గోలుపోయిన ద్వితీయ ప్రతాపరుద్రుఁడు. ఈ క్రీడాభిరామము 1420 వ సంవత్సర ప్రాuతమునందు రచియింపఁబడెను. ఈ కాలమునందు శ్రీనాధుఁడు కర్ణాటక దేశమునకుఁ బోయి వల్లభామాత్యుని సందర్శించి వల్లభాభ్యుదయమును [1] రచియించి యుండుటచేతను, క్రీడాభిరామములోని


  1. [శ్రీనాథుడు 'వల్లభాభ్యుదయము' అను గ్రంథమును రచించెనని కొందఱందురు. కాని యాగ్రంథము లభింపసందున దాని కర్తృత్వమును గూర్చి గాని, యందలి విషయమును గూర్చి గాని యేమియు నిశ్చయింవ సాధ్యము కాదు. ఇందు వినుకొండ వల్లభరాయని చరిత్ర వున్నదని చెప్పటకుఁ దగిన యాధారములు లేవు. శ్రీకాకుళమునందలి వల్లభ దేవుని మహాత్మ్యమును తెలుపు వల్లభాభ్యుదయమొకటి భట్లపెనుమర్తి కోదండకవి కృతము కలదు.]