పుట:Aandhrakavula-charitramu.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

313

వి న్న కో ట పె ద్ద న్న

కొప్పభూపతి, కొప్పభూపతిపుత్రుఁడుపేంద్రుఁడు (4), అతని పుత్రుఁడు మనుమోపేంద్రుఁడు, మనుమోపేంద్రునికొడుకు విశ్వేశ్వరభూపతి అని తేలుచున్నది.

శాసనమున విశ్వేశ్వరభూపతి మండపమును కట్టించిన సంవత్సరముకూడ నిట్లు తెలుపcబడినది.

        "శాకాబ్దే నవబాహు రామ శశి సం
                  ఖ్యాతే శుచౌ భాసితే
        సప్తమ్యా మినవారభాజి మహితః
                  సంస్థాపితో మండప8,
        కల్యాణాలోత్సవసిద్దయే సవిభవ8
                 శ్రీపంచధారాపురీ
        ధర్మేశస్యచళుక్య విశ్వధరణీ
                 భర్తా విచిత్రాస్పదమ్"

ఇందువలన విశ్వేశ్వరభూపతి మండపమును కట్టించినది నవ-బాహు-రామశశి సంఖ్య ఆనఁగా 1329 శ. సం. అని తేలుచున్నది. కావున విశ్వేశ్వర భూపతి శక సం.1329 అనఁగా క్రీ. శ 1407 ప్రాంతమువాఁడు. క్రీ.శ.1304 నకు వంద సంవత్సరముల తరువాతివాఁడు. ఈ శాసనముననే విశ్వేశ్వర భూపతి సర్వసిద్ధివద్ద చిత్రభాను సంవత్సరమునకు సరియయిన శకవర్షము 1424 ప్రాంతమున శత్రువుల నోడించెనని క్రింది శ్లోకమున శ్లేషింపఁబడినది.

                   'గతిబాహు శక్తి భూమితి
                             మవిగణయత్పర్వ సిద్దిపదభగ్నం
                    సతిచిత్రభానుసాక్షిణి
                             ధరణి వరాహా దధావ దాంధ్రబలమ్ ?