పుట:Aandhrakavula-charitramu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

279

మం చ న

అని తన తండ్రియైన చోడ బల్లి యిరువదియొక్క వేల యూళ్ళు గల పాకనాఁటి కధీశుఁ డని చెప్పెను. మంచన కేయూర బాహుచరిత్రమునందు రాజేంద్రచోడునిమంత్రి యైన కొమ్మనామాత్యుని వర్ణించుచు

         మ. అరుదందన్ వెలనాటి చోడ మనుజేంద్రాజ్ఞాపనం బూని దు
             స్తరశక్తిం జని యేకవింశతిసహస్ర గ్రామసంఖ్యాకమై
             ధరణిం బేర్చిన పాకనాఁడు నిజదోర్దండైకలగ్నంబు గాc
             బరిపాలించె నమాత్యకొమ్మన జగత్ప్రఖ్యాతచారిత్రుఁడై.'

అని రాజేంద్రచోడుఁ డను నామాంతరము గల వెలనాటిచోడమనుజేశ్వరుని యాజ్ఞానుసారముగా నిరువదియొక్కవేల గ్రామములు గల పాకనాఁటి నమాత్యకొమ్మన పరిపాలించినట్టు చెప్పెను. ఈ పాకనాటి రాజ్యమును కొత్తగా గెలిచి రాజేంద్రచోడుఁడు దాని పాలనమున కయి కొమ్మనామాత్యుని నియమించినట్టు కనుపట్టుచున్నది. ఈ విజయము 1170 వ సంవత్సరప్రాంతముల దయి యుండును. ఈ కొమ్మనామాత్యుఁడు మంత్రి యగుటయే గాక రణతిక్కనవలె దండనాధుఁ డయి మహాశార్యవంతుఁడయి కటకసామంతులు మొదలైనవారిని రణరంగమున భంగించినట్లీ క్రింది పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది.

          క. చలము మెయి. గటక సామం
             తులు కరిహయబహుళసేనతో నే తేఱన్
             దలపడియెఁ గొమ్మసచివుఁడు
             బలియుండై కొత్తచెర్ల పరిసరభూమిన్.

         సీ. సెలకట్టెవాటునఁ జెలఁగి రెంటిని మూఁటిఁ
                              గూడ గుఱ్ఱంబుల గుదులు గుచ్చుఁ
            బ్రతి మొగంబగు నరపతుల కత్తళమునఁ
                              గడిమిమై వీఁపులు వెడలఁ బొడుచు
            బందంపుగొఱియలపగిది నేనుంగుల
                              ధారశుద్ధిగ నసిధారc దునుముఁ