పుట:Aandhrakavula-charitramu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

157

తి క్క న సో మ యా జి

పేరు పెట్టియే దానిని రచించెను. ఆంతేకాక భారతమును చదువువారు సహితము నేఁటి వఱకును ఆరణ్యపర్వములోని కొంతభాగము వదలియే మఱిగ్రంధ పఠనము చేయుచున్నారు.

నన్నయభట్ట పోవునప్పటికిని పోయిన తరువాత రాజరాజనరేంద్రుడున్నప్పుడును తిక్కనసోమయాజి యున్నాఁ డని చెప్పెడు కధలు నమ్మఁదగినవి కాకపోయినను వినుటకు మాత్రము సొంపుగా నుండును. గనుక వానిలో నొక కధ నిందుఁ జెప్పచున్నాను

తన కంకితముగా నాంధ్రీకరింప నారంభించిన భారతమును పరిసమాప్తి నొందింపకయే నన్నయభట్టు మృతి నొందినందుకు చింతాక్రాంతుఁడయి రాజనరేంద్రుఁడు దానిని తా నెట్లయిన సాంతము చేయింపవలెనని బహు ప్రయత్నములు చేసి బహుపండితులను రావించి చూపఁగా వారెవ్వరును తన్మహాకార్యమునకు సమర్థులు కారైరఁట ! నిర్వచనో త్తరరామాయణమును జేసి ప్రసిద్ధి నొందిన యొక యాంధ్రకవీంద్రుఁడు నెల్లూరియం దుండె ననియు, అతనివలన గ్రంథపరిసమాప్తికాఁగలదనియు, విని పండితుల యనుమతిమీఁద సభాపర్వములోని

        మ. "మదమాతంగతురంగకాంచనలసన్మాణిక్యగాణిక్యసం
             పద లోలిం గొని తెచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి ర
             య్యుదయాస్తాచలసేతుసీతనగ మధ్యోర్వీపతు ల్పాంతతా
             భ్యుదయున్ ధర్మజుc దత్సభాసితు జగత్పూర్ణప్రతాపోదయున్."

అను పద్యమును తాటాకులమీఁద ప్రతులు వ్రాసి దానితో సమానమయిన పద్యమును వ్రాయుఁడని తక్కిన రాజాస్థానములయందలి పండితులకును, సిద్దిరాజసభయందున్న తిక్కనకునుగూడఁ బంపినట్టును, మిగిలినవారందఱును తమ తమకు తోఁచిన పద్యములను వ్రాసి పంపగాఁ తిక్కన మాత్ర మట్లు చేయక తానా పద్యమునే మరల మఱియొక తాటాకుమీఁద వ్రాసి దానికి వర్ణమువేసి పంపినట్టును, రాజరాజనరేంద్రుఁడు మిగిలిన కవుల పద్యముల నన్నిఁటిని జదివి వానిలో నేదియు నన్నయపద్యముతో సరి