Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఈ కవి రచించిన రెండవ గ్రంథము భారత శేషము ఆరణ్య పర్వమువఱకును నన్నయభట్టు తెనిఁగించి మృతి నొందఁగా తరువాత నీ మహాకవి యారణ్య పర్వశేషమును మాత్రము విడిచిపెట్టి విరాటపర్వము మొదలుకొని తక్కిన పదియేను పర్వములను తెనిఁగించెను. ఆరణ్యపర్వము నాంధ్రీకరించుట చేతనే నన్నయభట్టు మతిభ్రమణము కలిగి మృతి నొందె నని తలచుకొని తాను దానిని తెలిఁగించినచో తన గతియు నట్లే యగు నన్న భీతిచేత నితఁడు దానిని తెనిఁగింపఁడయ్యెను. అందుచేత తెనుఁగు భారతము కొంత కాలము పూర్ణముగా లేక కొఱఁతపడి యుండెను. ఆ కాలమునందు వ్రాయఁ బడిన తాళపత్ర గ్రంధములు కొన్ని యిప్పటికిని వనపర్వశేషము లేకయే కానఁబడుచున్నవి. తిక్కన భయపడి యరణ్యపర్వశేషమును తెనిఁగింపక విడిచి పెట్టలేదనియు, ఆతనికాలమునాటికి నన్నయభట్టుచేత రచియింపఁ బడి యారణ్యపర్వము పూర్ణముగా నుండుటచేతనే యతఁడు విరాటపర్వ మారంభించి చేసెననియు, తరువాత నారణ్యపర్వశేషము శంభుదాసుని కాలమునాఁటి కుత్సన్నము కాఁగా దాని నతఁడు పూరించె ననియు బుద్ధి మంతు లొకరు వ్రాయుచున్నారు. ఈ యుత్సన్న సిద్ధాంత కధ యిప్పడు ప్రతిపూర్వగ్రంథ విషయములోను మనవారిచేతిలో నమూల్యసాధన మయినిలిచి తోడుపడుచున్నది. శcభుదాసుఁడు తిక్కనసోమయాజికి తరువాత నేఁబది సంవత్సరముల లోపలనే యుండినవాఁడు. నన్నయభట్టే నిజముగా నారణ్యపర్వమును పూర్ణముగాc దెలిఁగించి యుండినచో నిన్నూఱు సంవత్సరములు తిక్కనకాలమువఱకు చెడక యుండి నిలిచిన యా భాగము తరువాత నేఁబది సంవత్సరములకు శంభుదాసునికాలమునకు దేశములోని యన్ని ప్రతులలో నొక్కసారిగా నశించుట సంభవించి యుండదు. నన్నయ దానిని చేయనే లేదనుటయే యుక్తియుక్తమయి విశ్వాసార్హమయిన పక్షము. తిక్కన తానెంతటి పండితుఁడయినను తన కాలపువిశ్వాసములను భయములను లేనివాఁడగుట సాధారణముగా సంభవింపనేరదు. ఈ కవిని బట్టిన భీతియే తరువాత నారణ్యపర్వశేషమును జేసిన యెఱ్ఱాప్రెగడకును పట్టి తన పేరిట గ్రంధరచన చేయక రాజనరేంద్రున కంకితముగా నన్నయభట్టు