పుట:Aandhrakavula-charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

తండ్రియైన సిద్దనకొడు కయినట్టు స్పష్ట మగుచున్నది. కవితిక్కనకును రణతిక్కనకును గల బంధుత్వమే కాటమరాజ చరిత్రమునందును జెప్పఁబడి యున్నది.

తిక్కనసోమయాజికి శిష్యుడైన మారన్న క్రీస్తుశకము 1295 వ సంవత్సరము మొదలుకొని 1323 సంవత్సరము వఱకును రాజ్యము చేసిన ప్రతాపరుద్రుని దండనాధుఁడయిన నాగయగన్నమంత్రికిఁ దన మార్కండేయపురాణము నంకితము చేసినందునఁ దిక్కన సోమయాజి పదమూడవ శతాబ్దమధ్యమునందున్న వాఁ డని నేను వ్రాసినదానికి ప్రతాప రుద్రులనేకు లున్నందున వారిలో నెవ్వరి మంత్రియైన నాగయగన్నయకుఁ గవి కృతి యిచ్చెనో యని శంక తెచ్చుకొని దానినిబట్టి తిక్కన కాల నిర్ణయము చేయవలనుపడ దనిరి. మార్కండేయపురాణమునందుఁ బేర్కొనఁబడిన ప్రతాపరుద్రుఁడు కాకతీయ గణపతిదేవునకు దౌహిత్రుఁడయిన రెండవ ప్రతాపరుద్రుఁడు, మొదటి కాకతీయ ప్రతాపరుద్రుఁడు తిక్కన కాలమునం దుండిన గణపతిదేవునితండ్రి మార్కండేయపురాణములోఁ గృతిపతియొక్క వంశానువర్ణనము చేయుచో --

           క. కుల రత్నాకరచంద్రుం
               డలఘుఁడు నాగాంకుఁ డన్వయస్థితికొఱకున్
               గులశీలరూపగుణములు
               గలకన్నియఁ బెండ్లియాడఁగా దలఁచి మదిన్.

           సీ. ఏరాజు రాజుల నెల్ల జయించి ము
                     న్వెట్టియ గొనియె దోర్విక్రమమున
               నే రాజు సేతు నీహారాద్రి మధ్యోర్వి
                     నేక పట్టణముగ నేల వాసి
               నే రాజు నిజకీర్తి యెన్మిది దిశల ను
                     ల్లాసంబు నొంద నలంకరించె
               నే రాజునవతేజ మీజగంబునకు
                   నఖండకదీపంబు గా నొనర్చె