పుట:ASHOKUDU.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

అ శో కుఁ డు

దురో యట్టివాడు బౌద్ధ సంఘమునుండి రాజాజ్ఞ చేఁ దరిమి వేయఁబడుచుండిరి. ఈ రీతిగా నాఱు వేలమంది కపట వేషధారులు బౌద్ధసంఘమునుండి తొలఁగింపఁబడినట్లు తెలియ వచ్చుచున్నది. పిమ్మట నాయర్హ సభ దురాత్ముల దురాచారములను రూపుమాపి భగవంతుఁడగు బుద్ధ దేవుని విశుద్ధ ధర్మసూత్రములను లిపిబద్ధములుగఁ జేయఁగలిగెను. ఈ పరిశుద్ధ సభా సాహాయ్యమున బౌద్ధధర్మపవిత్ర గ్రంథము(త్రిరత్న) వహ్ని సంస్కృతం బగుసువర్ణమువలె విశుద్ధమై మరల నందఱకును బరిగ్రహయోగ్యమయ్యెను.

ఆశోక సార్వభౌముని జీవితచరిత్రమునందును, బౌద్ధ ధర్మేతిహాసమునందును నీ మహాసంస్కార సభా విషయము చిరస్మరణీయమైనది.


ఇరువదియొకటవ ప్రకరణము


సద్గురువు

మౌర్యతిలకుఁ డగునశోక సార్వభౌముఁడు పూర్వాపర ధర్మాచారి యగునుపగుప్తుని యెడల భక్తిశ్రద్ధలు గల వాఁడై యుండెను. ఇప్పుడు మతము, సంఘసంస్కరణము మొదలగు వానియం దాతనితో గలసిపని చేయుటచే నశో

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/86&oldid=334626" నుండి వెలికితీశారు