పుట:ASHOKUDU.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము

77

బట్టియు నాలో చింపఁగా మత ప్రవర్ధనమున కొకసంస్కరణసభ యేర్పఱుపవలయునని నిశ్చయింపఁబడియెను. ఇచ్ఛయు,సామర్థ్యమును, నుపాదానము నేకమైనప్పుడు కర్మానుష్టాన మునకు విలంబము కలుగఁబోదు. పాటలీపుత్రసగరమున బౌద్ధధర్మసమాజ సంస్కర ణార్థమై యొక్క గొప్పసభ కూడెను. ధర్మాచార్యుఁడగు నుపగుప్తుఁడు సభాధ్యక్షుఁ డయ్యెను. నియమవంతులును, శాస్త్రజ్ఞులును, సుధీరులు నర్హులు నగు వేయిమంది బౌద్ధ నైష్ఠికులతో నొక సమితి యేర్పఱుపఁబడి యెను. కార్యనిర్వహణ విషయంబున నట్టిసమితికిఁ దొమ్మిది మాసము లవధి యేర్పఱుపఁ బడి యెను.

ఈసభయం దనేక దేశస్థులగు బౌద్ధులు చేరియుండిరి. అశోక మహారాజుకూడ నీ మహాసభా సభ్యుఁడై యుండెను. మతాధికారియగు నుపగుప్తుఁడు మహారాజసమక్షమున సభా గణసమాగతులగు బౌద్ధులనందఱను వారి వారిధర్మమత విశ్వాసములం గూర్చి విచారణ చేయుచుండెను; వారునడుచు కొనవలసిన పద్ధతులనన్నిటిని వారికి బోధించుచుండెను. వారి కార్యకలాపమల విస్పష్టముగఁ దెలిసికొనుచుండెను. ఈవిధముగఁ బరీక్షించుటవలన ననేకులగు కపటాత్ముల చరిత్రములు తెలియవచ్చుటచే ధర్మవిరుద్ధాచారానుష్టానముల సంగతులుకూడ విస్పష్టములు కాఁజొచ్చెను. సభాపరీక్షయం దెవ్వరు స్వార్థపరులును గపటాత్ములు నని నిశ్చయింపఁబడు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/85&oldid=334622" నుండి వెలికితీశారు