పుట:ASHOKUDU.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

అ శో కుఁ డు

కాతని కాపాటలీపుత్రమున - ఆర క్తరంజిత రాజమార్గమునఁ బట్టాభి షేక మహోత్సవము గావింపవలయునని యాలోచనతో చెను. "రాజధర్మము — రాజచరిత్రమైనది !!!

సర్వసంతాపసంహారకం బగుసమయము. ఈ నాలుగేండ్లలోనను రాజాంతఃపురమునందలి యనేకులు తమ శోక తాపములను మరచిపోయెయుండిరి. నగరమున శాంతి నెల కొల్పఁబడినది. నాగరకులు మరల సుఖ సంతోషములచే నుల్లసితహృదయులై సంచరించుచు రాజపథశోభాపరంపరల వర్ధిల్లఁ జేయుచుండిరి. శాంతి ప్రియులును, సుఖప్రియులు నగునగర జనుల హృదయములయందు మరల రణ భేరీనినాదము చెవులఁబడుట తటస్థించు నేమో యనుసం దేహ మైన నుదయించుట లేదు. ఇప్పుడు సంధ్యాసమీరణములచే నగర తోరణ స్తంభములయందలి విజయపతాకలు సవిలాసముగ సంచలితము లగు చుండెను. విజయ భేరీ మధుర నినాదములును, బూర్వవాహిని యగు జాహ్నవీతరంగకలకల నినాదంబులును గలసి మెలసి యపూర్వసంగీతస్వనంబును బ్రదర్శించుచుండెను. సంధ్యా సమయదీపమాలికలును, దిగంత వ్యాప్తంబు లగువిజయ భేరీనినాదములును, కలకలని నాదినియు, మందగామినియు నగు జాహ్నవీతరంగిణియందలి జలశీకరంబులచే నభిషి క్తంబులగు వాతపోతంబులును వారిత్వక్చక్షుశ్రోత్రంబుల స్పృశించుచు వారి పూర్వపు సంగతుల నన్నిటిని మఱపించుచుండెను. రాజాంతః పురమునందలి పతిపుత్రవియోగ దుఃఖితలగు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/60&oldid=333694" నుండి వెలికితీశారు