పుట:ASHOKUDU.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేనవ ప్రకరణము

మఱియు ననేక పుణ్య చరిత్రములను వినుచుఁ గ్రమముగా బౌద్ధపరివ్రాజకుల యోగ బలమాహాత్మ హాత్మ్యములంగూడ స్వయముగఁజూచి తెలిసికొనుచుండెను.

అశోకుని రాజ్యలోభకారణమున రాజ్యరక్షణమున కై యనేకులగు నపరాధులును, నిరపరాధులును, శత్రులును, మిత్రులును, తనవారును, బెజువారునుగూడఁ గఱకు కత్తులు పాలై పోయురి. ర క్తప్రవాహములతో నాలుగుసంవత్సరము లీవిధముగఁ గడచిపోయినవి.


పదునేనవ ప్రకరణము


అభిషేకము

మహారా జగుబిందుసారుఁడు లోకాంతరగతుఁడై యిప్పటికి నాలు గేం డ్లయ్యెను. రాజ్యలోభపరవశుఁ డై యున్న యశోకునకుఁ బితృమరణముంగూర్చి దుఃఖించుట కెప్పుడు నించుకంత యవకాశము దొరికినదిగాదు. ఆతఁడు తన రాజ్యరక్షణమున కై సోదరులనైనఁ జంపించుట కెంత మాత్రము ను శంకించియుండ లేదు. ఎందఱో భ్రాతలను, మఱియు నెందఱో పురజనులనుగూడ సంహరించి యాతడిప్పుడు నిరపాయుఁడై నిష్కంటకుఁ డై యున్నాఁడు. ఇన్నాళ్ళ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/59&oldid=350117" నుండి వెలికితీశారు