పుట:ASHOKUDU.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

అ శో కుఁ డు

బ్రవేశ పెట్టఁబడి యెను. చండగిరికుఁ డను సాలెవాఁడొకఁడు రాజద్రోహులశిరంబుల ఖండించు కార్యము నందునియుక్తుఁడై యుండెను. ఆతఁడప్పుడందఱవలెనే యాసన్యాసిని గూడ నఱకుటకు సన్నద్ధుఁ డయ్యెను: కాని యా సాధు వేమేమి యో చెప్పుటవలన నాచండగిరికుఁ డాతనికిఁ గొన్ని దినములు గడు విచ్చెను. ఈ గడువు లోపలనే యా భౌద్ధపరివ్రాజకు ని యపార యోగ బల మాహాత్మ్యము ప్రకటిత మయ్యెను. ఆసంగతి యథాసమయమున మహా రాజగున శోకుని చెవులఁ బడియెను. తోడ నే యశోకుఁడు స్వయముగ నచ్చటికిఁ బోయి యాసాధు శేఖరుఁడు నిరపరాధి యని సప్రమాణముగ గ్రహించుటయే కాక యాతఁడు మహాయోగి యనికూడఁ దెలిసికొనియెను. అప్పు డశోకుఁ డాతనికి నమస్కరించి తనయపరాధమును క్షమింపఁ ప్రార్థించి యామహాత్ముని విడుదల చేయించెను, అప్పు డానరఘాతుకు డగుచండగిరికుఁడు తొనదివఱకుఁ జేసిన మహోద్ధత కార్యములం గూర్చి యశోకునకు విన్నవించెను. నిందనీయంబగు నీవ్యాపార మంతయు నప్పు డశోకునకు రాక్షసకృత్యముగ నగ పడి యెను. తత్క్షణమె యశోకుఁడాహత్యామందిరము భస్మీభూతముగఁ జేయవలయు నని యాజ్ఞాపించెను. అది మొదలుగ రాజద్రోహులకు మరణ దండనము తప్పిపోయినది; అట్టివారిని వారి యప రాధములకుఁ దగురీతిని దండించుట కారంభమయ్యెను.

అదియే కారణముగా నంతటినుండి నవీనసార్వభౌముఁ డగునశోకుఁడు బౌద్ధయతులవలన బౌద్ధధర్మములను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/58&oldid=333691" నుండి వెలికితీశారు