పుట:ASHOKUDU.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

అ శో కుఁ డు

మింపకుండ రాజ్యమును గాపాడుట కేమి మహారాజగు నశోకుఁడు తన బలమును విభాగించి యాశాఖలమూలమున సర్వ సంరక్షణమునకును సమపాయములఁ గావించియుండెను.

సకలవిషయములను బాగుగ విమర్శించి చూడఁగా మహారాజగు నశోకుని కాలమున రాజ్య శాసన పద్ధతు లన్నియు నా కాలమునకు సర్వవిధముల నుపయోగకరములై సర్వ సంపూర్ణములై యుండెను.


ఇరువది తొమ్మిదవ ప్రకరణము


ధర్మ మంగళము

అశోక సార్వభౌముని కాలమున బౌద్ధమతము రాజునకును బ్రజలకును గూడఁ బరమాదరణీయముగా నుండెను. రాజునకును బ్రజలకును గూడ నొక్కటే మతమగుటవలన రాజునకును, బ్రజలకును, మతమునకును గూడ సర్వ శ్రేయములును లభింపఁగలవు. అశోకుని రాజ్యమున నట్టి భాగ్యము లభియించినది. అశోకుడు తన ప్రజల యైహికసుఖ సమృద్ధుల కొఱకెంతవఱకుఁ బ్రయత్నించి పని చేసినదియు నిదివఱకే విశేషించి చెప్పియున్నాము. కాని యశోకుఁడు తన ప్రజలందఱు నైహిక సుఖసంపన్ను లై యుండిర న్నంతమాత్రమున