పుట:ASHOKUDU.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

అ శో కుఁ డు

జేసి ధరియించు నలవాటుండెడిది. పురాతన కాలపు వస్తువులకును, వర్తమాన కాలపు వస్తువులకును నే విషయమునందైన నించుక సాదృశ్య మగపడుచున్నప్పుడు దానిం గూర్చి యించుక యాలోచించి విభేదకారణమును దెలిసికొని నిర్లయింపవలసి యుండును. కావున నింతవఱకు వ్రాయవలసి వచ్చినది. ఎట్లో యొక విధముగ నిప్పు డశోకుని కాలమునాఁటి ప్రజల వేషభూషణాదులం గూర్చి యించుక పరిచయముం గలిగింప జాలితిమి. ఈ స్వల్పపరిచయముంబట్టి యాలోచింపఁగా నప్పటివారి యభిరుచులును, సౌందర్యాదులును బాగుగ బోధపడఁగలవు. అశోక యుగమునఁ గట్టడపుఁబనులు చెక్కడ పుఁబనులు, రత్నపుఁబనులు, చిత్రపుఁబనులు మొదలగు శిల్పము లే కాక యింకను వివిధశిల్పములు విశేషించి యున్న ట్లగపడుచున్నది. వీనిలో నేఁత, వడ్రము, కమ్మరము కుంటలు చేయుట మొదలగు పనులు ప్రధానము లై యుండెను. ఈ పని వాండ్రు ధర్మాశోక రాజ్యమున వృత్తులననుభవించుచు సుఖజీవనము చేయుచుండిరి. ఒక్కమాటలోఁ జెప్పవలె నన్నచో నిట్టి వారిచేఁ జేయబడు శిల్పములన్నియు నభివృద్ధిలో నున్నవనియుఁ జనసమాదరముం గాంచియున్న వనియుఁ జెప్ప వలయును.

శిక్ష:-- బ్రాహ్మణ ప్రధాన మగు భారతవర్షమున “ విద్యాశిక్షణము " అనుమాట యగ్రవర్లోచిత విద్యాశిక్ష యని యెల్లరకును మనస్సునకుఁ దట్టును; గురువు, శిష్యుఁడు, గురుగృహము, బ్రహ్మచర్యము, గురుదక్షిణ మొదలగునవి