పుట:ASHOKUDU.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

113

యన్నియు, జ్ఞప్తికి వచ్చును. మే మిప్పుడేయుగమును గూర్చి చెప్పుచుంటిమో, యాకాలమున భారతవర్షమున బ్రాహ్మణ ప్రభావము లేనే లేదు. శిక్ష కేవల మగ్ర వర్ణముల వారి చేతులలోనే బంధింపబడి యుండ లేదు. బౌద్ధమతమునందు జాతి భేదము లేదు, జాతి భేదము లేదని చెప్పునప్పుడు విద్యాశిక్ష సర్వజనములయందును వ్యాపించియుండెనని వేఱుగఁ జెప్పనక్కఱ లేదు. మతముతోఁ గూడ విద్యాశిక్షణము నకు విశేష సంపర్కము కలిగియుండెను. శాస్త్రా లోచనము, శాస్త్ర బోధనము ధర్మసంహిత మొదలగు వానితో సంబంధముగల ఎల్లవారికిని వ్రాయటకును. జదువుటకును వలయు ననుకూలోపపత్తులు కావలసియుండెను. సకల దేశము లయందలి ప్రాచీ నేతి హాసముల యందు నిదియే యగపడు చున్నది. బౌద్ధయుగము నందుఁ గూడ నీ విద్యాశిక్ష విశేషించియుండెను, బౌద్ధ శ్రమణులును, భిక్షులును, మఠములయందును, విహారముల యందును వాసము చేయు చుశిష్యులకు విద్యా దానమును జేయు చుండిరి. వర్తమాన కాలమునందువ లె స్కూళ్లును, కాలేజిలను, ఎలిమెంటరీ పాఠ శాలలు నప్పుడు లేవు. బుద్ధధర్మ ప్రధాన మగు బర్మా దేశమునం దిప్పటికిని భిక్షులు దారు మందిరములయందుండి విద్యార్థులకు విద్యా దానము చేయుచున్నారు. ఆశోక సామ్రాజ్య మున నసంఖ్యము లగు మఠములుగు విహారములు నుండెను. కేవలము మతబోధకును, విద్యాశిక్షకును గావలసినన్ని సదుపాయములా కాలమునం