పుట:ASHOKUDU.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

111

ములు బోధపడఁగలవు. అప్పటి యువతీమణు లెట్టి యలంకారములను ధరియించు చుండిరో వావిని బట్టి స్పష్టముగఁ దెలిసికొనవచ్చును; కంకణములు, కంఠహారములు, కర్ణ పుష్పములు మొదలగు నలం కారము లప్పుడు విశేషముగా వాడుకలో నుండెను. చరిత్రమునం దశోక యుగముం గూర్చిన వర్ణనమును బఠించినప్పుడును, నప్పటి చిత్రశిల్పములం బరీ క్షించినప్పుడును నప్పటి వారు విశేష వేషభూపణాలంకృతులై యున్నట్లు స్పష్టపడగలదు. భాగవతవర్ణింతబగు శ్రీ కృష్ణుని మోహనపింఛమును, బీతాంబర ధారణమును నప్పటి పురుషుల సమాదరాలం కారములై యుండెను. ధనికులు, వర్తకులు మొదలగువారి యుష్ణీషములయందు శ్రీకృష్ణుని చూడాలంకారము వలె నోక యమూల్యాలంకారము ఫణిఫణారూపమున విరాజిల్లు చుండెడిది. ధరించిన పరిధానము నంద నందనుని పీతాంబరమువలె నల రారుచుండెడిది. ఆ పీతాంబరమునకుఁ గ్రిందియంచులు మెఱయుచుండెడివి. అట్టి వస్త్రముల పై నమూల్య 'కాంచీ దామము లలంకారములుగ నుండెడేవి. ఇరువది ముప్పది సంవత్సరములకుఁ బూర్వము వఱకు బంగాళా బాలికల కట్టి మండలముల పై నిట్టి చంద్రహారములును, సూర్య హారములును ధరియింపఁబడుచుండెను. అప్పటి పురుషులతో నిట్టి యలంకార రచన లుండెను. ఏఁబది సంవత్సరములకు, బూర్వము బంగాళ దేశము నందలి నిమ్నజాతి పురుషులలో దలపై బక్షిఱెక్కలను గత్తిరించి జూలుగాఁ