పుట:2015.396258.Vyasavali.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
58

వ్యాసావళి

ముఖ్యగ్రంధములు అన్నీ అవివేక పరిష్కరణమువల్ల అప్రమాణమైనవి. అపశబ్దములు అర్వాచీనశబ్దములు ప్రాచీనుల భాషలోచేరినవి. వాటిపట్టి వాస్తవమైన భాషా నియమములు ఏర్పరచుట అసాధ్యము. భావి విమర్శకులకు విహితమైన ధర్మములు తెలుసుకోదగిన వారుకూడ వాటికి విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు. ఇతిహాసిక మందలివారికి వాస్తవమయిన ఆంధ్రభాషా చరిత్రము నిర్మించవలెనని అభీలాష గాఢముగా ఉన్నదని అనుకొంటారు. వారి అభిలాష నెరవేరవలె నంటే, ప్రాచీనాంధ్రగ్రంధముల వ్రాతప్రతులు ఆధారముగా చేసుకొని, పక్షపాతములేకుండా, తత్వజిజ్ఞాసతో, సవిమర్శముగా సంప్రతించి పాఠములు పరిష్కరించ వలెను. ఇది మొట్టమొదట చేయవలసినపని. అన్ని గ్రంధములకన్నా భారతము గొప్పది. అందులో నన్నయ రచించిన భాగము ఆదిమాంద్రకవిత గనుక పరమాధారమయినది. దానిలోని పాఠములు సాధ్యమై నంతమట్టుకు వాస్తవమని విశ్వసించదగినట్టుండవలెను. విశ్వసనీయముకాక తప్పదు. దానికై పడ్డపాటు వ్యర్దము. అందుచేతనే మ.చిలుకూరి నారాయణరావు పంతులు గారు మొదలయినవారు ఈ విషయమై కృషిచేసినవారైనా నిరుత్సాహులయి ఊరుకున్నారు. ఇప్పుడున్న లక్షణగ్రంధములు-కోశములు గానీ, వ్యాకరణములుగానీ, ప్రమాణముగా అంగీకరించదగి నవికావు. అప పాఠములుగల గ్రంధములనుండి ఎత్తికొన్న శబ్దములు సాధువులుగా అంగీకరించిన వారు నిర్మించినవిగానీ, నిర్మించబోయేవిగాని, లక్షణములు ఎందుకు ప్రమాణమవుతవి? శబ్దరత్నాకరమునందున్న శబ్దములు ముద్రితగ్రంధములలోని పాఠములకు విరుద్ధముగా ఉంటవి. ముద్రిత గ్రంధములందున్న పాఠములలో వైవిద్యమున్నది.