పుట:2015.396258.Vyasavali.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

-48 వ్యాసావళి పంతులవారి యభిప్రాయము తప్పు అని చెప్పుటకు తగిన హేతువు లున్న వి. మొట్ట మొదట భూదానశాసనములలో సరిహద్దులు వివరించి వ్రాసిని వాక్యములందు ఏవార్ధకము (పయోగించుట సంప్రదాయవిరుద్ధము కాదని చెప్పుటకు ప్రమాణముచూపిస్తాను. పిఠాపురమందున్న మల్లి దేవుని శాసనములో (చూ. ఎపి. ఇండి. IV. పుట 92) నందంపూడి శాసనములో నన్నయవ్రాసినట్లే ఏనిమిది దిక్కుల సరిహద్దులు చెప్పిన వాక్యములలో కొసను వరుసగా ! ఎగుంటయసీమా, 2 కాలియసీమా 3 గుఱ్ఱయసీమా, 4 గుంట యసీమా 5 గంటలసీమా, 6 గట్టయసీమా, 7 గట్టయసీమా, 8 వంక యసీమా అని ఏవార్ద కాకార సహితము గా నే శబ్దములున్నవి. అకారాంతేకారాంత శబ్ద ములకు పరమందు ఆకారమున్న చోట యడాగమమువచ్చి నదీ. అయిదవ వాక్యములోని గుంటల”అనేది బహువచనరూపమయిన “గుంటలు)కు పర ముగా అకారమువచ్చినందున సంధిఅయి ఏర్పడ్డది. ఇట్లు పూర్వకాల మందు దానశాసననిబంధనము లుండేవని తెలియక పోయినా ప్రాచీనాంధ్ర భాషా సంప్రదాయములయినా తెలిసిఉంటే నన్న శాసనములోనున్న ఏవార్త కాకార సహిత శబ్దములను గురించి పంతులవారికి కలిగిన చిక్కులు విడదీయుట -కష్టముగా ఉండదు. * నడుమ” లోని అంత్యవర్ణము ఏవార్ధక నుయిన - అకారము కాదని తప్పుసిద్దాంతము తలకెక్కి గట్టిగా పట్టుకోగాబట్టిక దా 'నన్నయ "కాలము మొదలుకొని నేటివరకున్న ఉకారాంతముగా లోక వ్యవహారమందే కాక గ్రంథములందున్ను వాడుక లోఉన్న ఈ నడుము” శబ్దము (నడుమ అని అకారాంతముగా పంతులవారివంటి పండితులు కూడా అనుశాసనము చేయుట సంభవించినది. నందంపూడి శాసనములోనే 66వ పంకిలో నన్నయ << రెండేజులనడిమివిషయ” అని వ్రాసినాడు. గాంథిక భాషలో ( నడుము” ఈ నడిమికి” “ వడుమన్' ప్రచురముగా నన్న యాదుల కావ్యములలో కన : బడుచున్నవి. శబ్దరత్నాకరమం దుదాహృతమై ఉన్న వి. ఈ నడుమ