పుట:2015.396258.Vyasavali.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

రాజరాజు కాలమందున్న తెనుగుభాష 4f వ్యయ ప్రయాసముల గోపమిచేతనో, యోషీయుఁ దగిన వాఁతప్రతులు దొర కమిచేతనో, తరువాతి ముద్రణములన్ని యు మొదటి ముద్రణము ననుసరించి గతానుగతికముగాఁ దప్పులకుప్పలై నవి. ఇటీవల 'రెండొక ముద్రణములు వ్రాఁతపతుల తోడ్పాటుతోఁ దప్పులు లేకుండునట్లు చేయబడినవనుటే కొని చాలవణికందును దప్పులు చూపట్టుచున్నవి. కనుక నీ గ్రంథమును మజల వ్రాతప్రతులతోఁబోల్చి సవరించుట యావశ్యకమయ్యెను.” ఇట్టివారు పరిష్కరించిన గ్రంథములోకూడా అపరిమితముగా అపపొఠములున్నవి. ఈ అపపాఠములలోని శబ్దవులు కోశములలో చేరి నవి. అవి సప్రమాణము గాఁ గ్రహించి గ్రంథకర్తలు తవ గ్రంథములలో వాడుతున్నారు. ఆ విషయము అట్లుండనీయండి. తాటాకు పుస్తకములలోని పాఠములయినా విశ్వాసాము. కావని అప్పకవి నాటినుండిని లాక్షణికులు చెప్పుతున్నారు. బ్ర. శ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రలవారు హరిశ్చంద్ర నలోపొఖ్యాన విమర్శనములో (చూ. ఫుటలం 85-87). "యధాస్థితిగా గ్రహింపఁదగిన నిర్దుష్టమగు మాతృక యొకటియైన గలదని యెవ్వరును జెప్పజాలరుగదా ఇంతియ కాక యాయా 'కాలములందుఁ బ్రసిద్దములయి పోడుక లోనికివచ్చి, యుండు వ్యాకరణముల యొక్యమునుబట్టియు, సొయా కాలముల వ్యావ హారికాంథముయొక్క మైక్యమునుబట్టియు సవరణములలో నట్టి సంవాద ములు లభించినను లభించవచ్చును. అంతమాత్రమున నట్టి సంవాదముకవి ప్రయుక్త తను దృఢముగా స్థాపింపఁజాలదుగదా, మణియు మనకుదొరకు మాతృక లెల్ల సుమారు రెండుమూడువందల సంవత్సరములలోపలివే గదా. తఱచుగా పొనిలోని సవరణము లాంధ్రశబ్దచింతామణ్యప్పకవీ యాదుల నను సరించియే యుండును ...... ఇట్టి కారణములచేఁ గల్గు సంవా దములు ప్రమాణములని గ్రహించుట సరియా” అని వాతపతుల దోష